ఈ ఫోటోలో గుండు కొట్టించుకున్న చిన్నారి ఎవరో తెలుసా.. ప్రజెంట్ ఒక స్టార్ హీరోయిన్?

Guess The Heroine Do You Know Who Is She ,sameera Reddy, Sameera Reddy Childhood Photo,Actress Sameera Reddy

సాధారణంగా సోషల్ మీడియాలో నిత్యం సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ప్రస్తుతం ఒక స్టార్ హీరో,స్టార్ హీరోయిన్ అంటూ క్యాప్షన్ లు కూడా జోడిస్తూ ఉంటారు.

 Guess The Heroine Do You Know Who Is She ,sameera Reddy, Sameera Reddy Childhoo-TeluguStop.com

ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.తాజాగా కూడా ఒక హీరోయిన్ కి సంబంధించిన చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ ఫోటోలో గుండుతో చూడడానికి ఎంతో క్యూట్ గా బూరె బుగ్గలతో ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి తెలుగు సినిమాలో టాప్ హీరోలతో నటించి మెప్పించింది.అంతే కాకుండా టాప్ హీరోయిన్గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.మరి ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి మరెవరో కాదు నటి సమీరా రెడ్డి.సమీరా రెడ్డి మొదట తెలుగులో నరసింహుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత చిరంజీవితో కలిసి జై చిరంజీవ సినిమాలో నటించింది.తర్వాత అశోక్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి మెప్పించింది.

కాగా సమీరా రెడ్డి చివరగా కృష్ణం వందే జగద్గురుం సినిమాలోని ఒక పాటలో కనిపించింది.సమీరా రెడ్డి సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.తరచూ సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను పంచుకుంటూ ఉంటుంది.కల 2014లో వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం సమీరాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube