ఇక పండగ చేస్కోండి : జీఎస్టీలో ఇవన్నీ తగ్గాయి

ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వినియోగదారులకు ఇది శుభవార్తే.శనివారం జరిగిన 31వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో 23 నిత్యావసర వస్తువులపై జీఎస్‌టీని తగ్గించారు.

 Gst Slab Rate These Items Got Cheaper After Council Cuts Gst-TeluguStop.com

టీవీలు, వీడియో గేమ్స్ కన్సోల్స్, డిజిటల్ కెమెరాలు, వీడియో కెమెరా రికార్డర్లు, పవర్ బ్యాంకులు, మానిటర్లు, 32 అంగుళాల వరకు టీవీ స్క్రీన్లు తదితర వాటిని 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు.

ఇప్పటి వరకు ఇవి 28 శాతం పన్ను పరిధిలో ఉండేవి.జీఎస్‌టీ తగ్గింపు నిర్ణయం అనంతరం కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.జీఎస్‌టీ ధర తగ్గింపు వల్ల ఏడాదికి వస్తుందనుకున్న ఆదాయం నుంచి రూ.5,500 కోట్లు తగ్గిపోతున్నట్టు చెప్పారు.

ఇవన్నీ తగ్గాయి ….

*వీల్ చైర్స్ పై జీఎస్టీ 28 నుంచి 5 శాతానికి తగ్గింపు.

*మోటార్ వెహికల్ భాగాలు, టీవీలు, కంప్యూటర్ విడిభాగాల ధరలు తగ్గనున్నాయి.

*లిథియం బ్యాటరీలు, వీసిఆర్లు, టైర్లు, 32 అంగుళాల టీవీలపై తగ్గింపు.

*28 శాతం స్లాబులో ఏసీలు, డిష్ వాషర్లు తగ్గుతాయి.

*స్పోర్ట్స్ ఐటమ్స్ ను కూడా 28 శాతం స్లాబ్ నుంచి తొలగించారు.

*సినిమా టిక్కెట్లు వంద రూపాయిల కన్నా ఎక్కువ ఉంటే 28 నుంచి 18 శాతం స్లాబ్ రేట్ లోకి, 100 రూపాయిలకన్నా తక్కువ ధర ఉంటే.18 శాతం నుంచి 12 శాతం స్లాబ్ రేట్ లోకి వచ్చాయి.

*మోటార్ వెహికల్ పార్టులు, టీవీ, కంప్యూటర్ల రేట్లు తగ్గుతాయి

*ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం విమానాల్లో ప్రయాణించేవారికి ప్రీమియం ట్యాక్స్ తొలగింపు

*వీడియోగేమ్స్‌పై పన్ను 28శాతం నుంచి 18శాతానికి తగ్గింపు

*బేసిక్ సేవింగ్స్, జన్‌ధన్‌ ఖాతాదారుల అకౌంట్లకు జీఎస్టీ నుంచి మినహాయించారు.

*థర్డ్ పార్టీ బీమా 12 శాతానికి కుదించారు.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు