గోదావరిలో గ్రూప్ పాలిటిక్స్ ! నేడు సెట్ చేయనున్న జగన్ ?

వైసిపి ప్రక్షాళన పైనే పూర్తిగా దృష్టి సారించారు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్( CM Jagan ).వచ్చే ఎన్నికల్లో టఫ్ ఫైట్ నెలకొనబోతుండడంతో, ముందుగానే అన్ని వ్యూహాలను జగన్ సిద్ధం చేసుకుంటున్నారు.

 Group Politics In Godavari! Pictures To Be Set Today , Jagan, Ap Cm Jagan, Ysrcp-TeluguStop.com

ముఖ్యంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో వచ్చే సీట్లు కీలకం కాబోతుండడంతో, ఆ రెండు జిల్లాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు, జనసేన కూడా రెండు గోదావరి జిల్లాల పైనే ఎక్కువ ఆశలు పెట్టుకోవడంతో వైసిపి కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది.

ఈ మేరకు ఈ రెండు జిల్లాలకు చెందిన కీలక నేతలతో జగన్ నేడు సమావేశం కాబోతున్నారు.ఇటీవలే వారాహి యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ రెండు జిల్లాల్లోనూ పర్యటించారు.

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేశారు.పవన్ యాత్రకు వచ్చిన స్పందన పైన వైసిపి వర్గాలు ఆరా తీస్తున్నాయి.

వచ్చే ఎన్నికల్లో జనసేన, టిడిపి ( Janasena, TDP )ప్రభావం ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లోనూ కనిపించబోతుండడంతో, జగన్ స్వయంగా రంగంలోకి దిగారు.

రాజమండ్రిలో కీలక సమావేశాన్ని జగన్ ఏర్పాటు చేశారు.

రెండు జిల్లాలకు చెందిన కీలక నేతలంతా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు.ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ పరిస్థితులు ఆందోళనకరంగా ఉండడం, ఎక్కడికక్కడ గ్రూప్ రాజకీయాలు పెరిగిపోవడం, టిడిపి, జనసేనల ప్రభావం ఎక్కువగా ఉండడంతో కొన్నికొన్ని కీలక నియోజకవర్గాల్లోని నాయకులు మధ్య నెలకొన్న గ్రూపు రాజకీయాలను పరిష్కరించి, వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.

ఈ మేరకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి( MLA Dwarampudi Chandrasekhar Reddy ), పుదుచ్చేరి మాజీ ముఖ్య మంత్రి, టీటీడీ బోర్డు సభ్యుడు మల్లాడి కృష్ణారావు మధ్య గత కొంతకాలంగా నెలకొన్న విభేదాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Kakinada Mla, Pillisubash, Telugudesam, Ysrcp-Pol

గత జూన్ లో మల్లాడి పుట్టినరోజు సందర్భంగా కాకినాడలో ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు.ఎమ్మెల్యే ద్వారంపూడి ఆదేశాలతో వాటిని తొలగించాలని కృష్ణారావు వర్గీయులు మండిపడుతున్నారు.అలాగే జూన్ లో బీసీ సంఘాలతో మల్లాడి కాకినాడలో సమావేశం నిర్వహించ తలపెట్టగా, ఆ సభకు వైసీపీలోని కృష్ణారావు సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు, నేతలు వెళ్ళకుండా అదేరోజు ఎమ్మెల్యే వర్గం బీసీ ర్యాలీకి సిద్ధమైంది.

దీంతో ఇరువర్గాలు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో, పోలీసులు రెండు సభలకు అనుమతి నిరాకరించారు.

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Kakinada Mla, Pillisubash, Telugudesam, Ysrcp-Pol

ఇక అమలాపురంలో మంత్రి పినిపే విశ్వరూప్ , ఎంపీ చింతా అనురాధ, జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, మాజీ ఎంపీ తోట నరసింహం, పత్తిపాడులో ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మధ్య తీవ్రంగా విభేదాలు ఉన్నాయి.జగ్గంపేట టిక్కెట్ రేసులో ఉన్న తోట నరసింహం నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.ప్రత్తిపాడు లో ఎమ్మెల్యేతో ఇద్దరు ఎంపీపీలు, ఒక జెడ్పిటిసి సభ్యురాలు వివేదిస్తున్నారు.

కొంతమంది కౌన్సిలర్లు రాజీనామా కూడా చేశారు.వీటన్నిటి పైన జగన్ వద్ద పంచాయతీ జరగబోతోంది.

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Kakinada Mla, Pillisubash, Telugudesam, Ysrcp-Pol

ఇటీవల సంచలనం సృష్టించిన రామచంద్రపురం నియోజకవర్గం( Ramachandrapuram Constituency ) విషయంలోనూ జగన్ దృష్టి సారించబోతున్నారు.మంత్రి వేణుగోపాలకృష్ణతో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ విభజించడం, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని, స్వతంత్రంగా నైనా పోటీ చేస్తానని పిల్లి ప్రకటించడం, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం వంటి వ్యవహారాల పైన జగన్ చర్చించి ఒక పరిష్కారాన్ని సూచించబోతున్నారు.ఇదేవిధంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలోని కీలక నియోజకవర్గలపైనే జగన్ ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube