కొడుకుతో రొమాన్స్ చేస్తున్న గృహాలక్ష్మి లాస్య.. బాగా ఆడుకుంటున్న నెటిజన్స్?

బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్ తర్వాత అటువంటి క్రేజ్ ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ అందుకుంది.ప్రస్తుతం ఈ సీరియల్ మంచి ప్రేక్షకాధారణతో దూసుకెళ్తుంది.

ఇక ఇందులో నటిస్తున్న నటీనటులకు కూడా మంచి క్రేజ్ వచ్చింది.తెలుగు ప్రేక్షకులతో మంచి అభిమానాన్ని కూడా సంపాదించుకున్నారు.

ముఖ్యంగా తులసి, లాస్య పాత్రలు మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి ఉంటాయి.ఇక వీరిద్దరూ సీరియల్ లో శత్రువులు.

కానీ బయట మాత్రం మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటారు.

Advertisement

ముఖ్యంగా లాస్య మాత్రం సమయాన్ని మొత్తం సోషల్ మీడియాలోనే గడుపుతుంది.ఇక తను చేసే వీడియోలకు బాగా ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటుంది.

అయితే తాజాగా తన వీడియోకు మరోసారి ట్రోల్ ఎదుర్కొంది ఈ బ్యూటీ.ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.

లాస్య అసలు పేరు ప్రశాంతి.ఈమె ఈ సీరియల్ లో విలన్ పాత్రతో బాగా మెప్పిస్తుంది.ఈ సీరియల్ తో ప్రశాంతి మంచి క్రేజ్ సంపాదించుకుంది.

కెరీర్ మొదట్లో ప్రశాంతి యాంకర్ గా పలు షోలలో చేసింది.యాంకర్ గా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.

బాలయ్య టాక్ షోకు పోటీగా రానా టాక్ షో.. ఆ ప్రముఖ షోకు హాజరయ్యే గెస్టులు వీళ్లే!
వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?

వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.కానీ ఎందుకో అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.

Advertisement

ఒక నటిగా కంటే, యాంకర్ గా కంటే వ్యక్తిగతంగా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.ఆ సమయంలో తన కెరీర్ కు ప్రభావం చూపించిందనే చెప్పవచ్చు.

ఆ తర్వాత కోలుకొని బుల్లితెరపై అడుగుపెట్టింది.అలా ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో విలన్ పాత్ర తో మంచి సక్సెస్ అందుకుంది.

ఈ సీరియల్ తో పాటు మరికొన్ని సీరియల్లలో కూడా నెగిటివ్ పాత్రలో నటిస్తుంది.ప్రశాంతి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.

తన హాట్ ఫోటోలతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది.అలా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.తన డాన్స్ వీడియోలతో మాత్రం కుర్రాళ్ళను ఫిదా చేస్తుంది.తన తోటి నటులతో డాన్స్ చేస్తూ బాగా రచ్చ చేస్తుంది.

ఇక తాజాగా తాజాగా తన ఇన్ స్టాలో ఓ వీడియోని షేర్ చేసుకుంది.అందులో గృహలక్ష్మి సీరియల్ లో తన రెండవ భర్త కొడుకు ప్రేమ్ తో మహేష్ బాబు పాటతో రొమాంటిక్ డాన్స్ చేస్తూ కనిపించింది.

దీంతో ఆ వీడియోని చూసిన నెటిజన్స్ వెంటనే ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.తమ కామెంట్లతో ఆమెను బాగా ఆడుకుంటున్నారు.

కొడుకు వరుస అయ్యే కుర్రాడుతో ఏంటమ్మా నీ రొమాన్స్ లు అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక మరి కొంతమంది.

రేయ్ ప్రేమ్.పిన్ని రా అది.మీ అమ్మకు తులసికి తెలిస్తే.ఒరేయ్ ప్రేమ్.

ఎంత పని చేశావు రా.అని గుండె పట్టుకొని ఏడుస్తది అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.

తాజా వార్తలు