ఆరోగ్యానికి అండగా ఆకుకూరలు.. ఇంతకీ ఏది ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?

ఆకుకూరలు( Greens ).వీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

ఆరోగ్యానికి అండగా నిలిచే ఆకుకూరల్లో ఎన్నో అద్భుతమైన పోషక విలువలు నిండి ఉంటాయి.

అందుకే ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర డైట్ లో ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

మరి ఇంతకీ ఏ ఆకుకూర ఎలా ఉపయోగపడుతుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా తోటకూర నుంచి ప్రారంభిస్తే దీనిలో కాల్షియం, ఐరన్ మెండుగా నిండి ఉంటాయి.

తోటకూరను తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.హిమోగ్లోబిన్ శాతం తగ్గకుండా ఉంటుంది.

Advertisement

అలాగే పాలకూరలో విటమిన్ సి, విటమిన్ ఈ, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.పాలకూరను డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.

జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గా సాగుతుంది.మరియు పాలకూర( Lettuce ) యాంటీ క్యాన్సర్ గా పని చేస్తుంది.

గోంగూర( Gongura ) చాలా మందికి ఫేవరెట్ ఆకుకూర.గోంగూర కంటి చూపును పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది.అదే సమయంలో థైరాయిడ్ ( Thyroid )ను కంట్రోల్ లో ఉంచుతుంది.

వంటలకు చక్కని సువాసన రుచి అందించే పుదీనా లో కూడా బోలెడు పోషకాలు నిండి ఉంటాయి.పుదీనాను తీసుకోవడం వల్ల శరీరంలో అధిక వేడి తొలగిపోతుంది.మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

పుదీనాను తింటే నోటి నుంచి దుర్వాసన రాకుండా సైతం ఉంటుంది.కొత్తిమీర విషయానికి వస్తే దీనిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధాప్య లక్షణాలు త్వరగా చేరకుండా అడ్డుకుంటాయి.

Advertisement

మునగాకు( Drumstick leaves ) ఆరోగ్యపరంగా ఇది చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది.మునగాకులో ఐరన్, కాపర్, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.మునగాకును తరచూ తీసుకుంటే రక్తహీనత బారిన పడకుండా ఉంటారు.

గుండెపోటు, మధుమేహం,( Diabetes ) ఊబకాయం వంటి జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.ఇవే కాకుండా మనకు అందుబాటులో ఎన్నో ర‌కాల‌ ఆకుకూరలు ఉంటాయి.

ప్రతి ఆకుకూర మన ఆరోగ్యానికి అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.కాబట్టి రోజుకు ఏదో ఒక ఆకుకూర అయినా తినేలా చూసుకోండి.

ఆరోగ్యంగా జీవించండి.

తాజా వార్తలు