ఇది కదా సినిమా పిచ్చి అంటే.. తాత చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్?

సాధారణంగా మనం ఇంట్లోకి ఏదైనా సరుకులు కావాలన్నప్పుడు లేదంటే ఏదైనా కొన్ని ముఖ్యమైన విషయాలు ఉంటే తర్వాత మళ్లీ మర్చిపోతామేమో అని ఒక పేపర్ లో రాసుకుంటూ ఉంటాము.ఇక ఇంట్లో ఉండే ఆడవారు అయితే ఇంట్లో అయ్యే ఖర్చులు సరుకులు ఇలా ఏ ప్రతి ఒక్కటి కూడా రాసుకుంటూ ఉంటారు.

 Grandfather Has Record Of All Films He Watched Details, Grand Father, Watching M-TeluguStop.com

కానీ ఎవరైనా కానీ ఏ సినిమా చూసాము?ఎన్ని సినిమాలు చూసాము అన్నది రాసుకుంటారా అనగా పిచ్చోళ్ళు రాసుకుంటారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు.కానీ ఒక సినిమా లవర్ మాత్రం అసలు సిసలైన సినిమా ప్రేమికుడు తాను అని నిరూపించుకున్నాడు.

సినిమా ప్రేమికుడిని తన తాతను పరిచయం చేశాడు ఒక మనవడు.అసలు విషయంలోకి వెళితే ఏజే అనే ఒక ట్విట్టర్ యూజర్ తన తాత చూసిన సినిమాల జాబితా అంటూ ఒక పేజీని తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఇక ఆ ఫోటోలో వారి తాత చూసిన సినిమాలు వాటి సంఖ్యతో పాటుగా సినిమా చూసిన తేదీ షో సమయం టికెట్ కు ఎంత ఖర్చు పెట్టాడు అన్నది సరుకుల పట్టి రూపంలో రాసి పొందుపరుచుకున్నాడు.కేవలం ప్రాంతీయ సినిమాలు మాత్రమే కాకుండా ఇంగ్లీష్ సినిమాలు కూడా చూసినట్టు రాసుకొచ్చాడు.

అయితే అవన్నీ కూడా 1958 నుంచి 1974 వరకు కూడా చూసిన సినిమాల జాబితాగా మనవడు తెలిపాడు.ఆయన నమోదు చేసిన జాబితాలో మొత్తంగా 470 సినిమాలు చూసినట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫోటో ని చూసిన సినిమా ప్రేమికులు అసలు సిసలైన సినిమా పిచ్చోడు మీ తాతయ్య అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.మరికొందరు తాతయ్య చాలా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోని మిగిలిన సినిమాల లిస్టు ఫోటో కూడా పెట్టండి అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube