మొదటిసారి అత్తారింట్లోకి అడుగుపెట్టిన పరిణితి చోప్రా.. సర్ప్రైజ్ ఇచ్చిన రాఘవ్ ఫ్యామిలీ?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి నటి పరిణితి చోప్రా( Parineeti Chopra ) తాజాగా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.ఈమె ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా( Raghav Chadha ) ను వివాహం చేసుకున్నారు.

 Grand Welcome To Parineeti Chopra At Raghav Chadha House Photos Goes Viral ,-TeluguStop.com

వీరి వివాహం సెప్టెంబర్ 24వ తేదీ ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా వీరి పెళ్లి వివాహ రిసెప్షన్ హానీమూన్ అన్ని పూర్తి చేసుకొని మొదటిసారి పరిణితి చోప్రా అత్తగారింట్లోకి అడుగు పెట్టింది.

ఇలా ఈమె మొదటిసారి తన భర్తతో కలిసి అత్తారింటికి రావడంతో రాఘవ్ ఫ్యామిలీ ఆమెకు చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.ఇలా ఇల్లు మొత్తం ఎంతో అద్భుతంగా డెకరేట్ చేసి కొత్త కోడలికి స్వాగతం పలకడంతో ఒక్కసారిగా ఈమె ఆశ్చర్యపోయారు.సాంప్రదాయం ప్రకారం కొత్తకోడలికి స్వాగతం పలకడమే కాకుండా ఇద్దరి మధ్య కొన్ని గేమ్స్ పెట్టారు.

ఇలా అన్నింటిలోనూ పరిణితి చోప్రా ( Parineeti Chopra )చాలా ఆనందంగా పాల్గొన్నారు.ఇలా అత్తగారింట్లో తనకు వెల్కమ్ చెప్పినటువంటి వీడియోని పరిణీతి చోప్రా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఇక ఈమె గారింట్లోకి అడుగుపెట్టడంతో వారి ఆచారాల ప్రకారం నిర్వహించాల్సిన కార్యక్రమాలన్నింటినీ కూడా ఇందులో మనం చూడవచ్చు.ఇకపోతే ఈ వీడియోలో పరిణతి చోప్రా మాట్లాడుతూ ఈ ప్రపంచంలో అందరికంటే బెస్ట్ ఫ్యామిలీ ఇదేనని ఇక్కడ నన్ను ఒక రాణిలాగా చూసుకుంటారు అంటూ ఈమె తన సంతోషం వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఈమెకు ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు లైఫ్ లాంగ్ ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube