టాలీవుడ్ లో గత రెండు రోజుల క్రితం ఇండియన్స్ గర్వించే పరిణామం చోటు చేసుకుంది.వరల్డ్ వైడ్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఆస్కార్ అవార్డు( Oscar Award ) ముందు వరుసలో ఉంటుంది.
మరి ఎప్పటి నుండో మన ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డ్ మన తెలుగు సినిమాకు రావడం పట్ల ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరి మొత్తానికి ఆస్కార్ అవార్డులు ముగియడమే కాకుండా ఆస్కార్ గెలుచుకుని తెలుగు గడ్డపై అడుగు పెట్టనున్నారు.
ఆర్ఆర్ఆర్ టీమ్ లో ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR )మన హైదరాబాద్ కు చేరుకున్నారు.ఆస్కార్ గెలుచుకుని ఇండియాకు తిరిగి రావడంతో ఈయనకు ఇక్కడ ఘన స్వాగతం లభించింది.
ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో తారక్ హైదరాబాద్ చేరుకున్నారు.

ఎయిర్ పోర్టులో తారక్ కు స్పెషల్ వెల్కమ్ దక్కింది.దీంతో అక్కడి విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉండగా తారక్ సినిమాల విషయానికి వస్తే.
ఎన్టీఆర్-కొరటాల కాంబోలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా షూట్ ఇప్పటికే చాలా ఆలస్యం అవుతుంది.
దీంతో ఎన్టీఆర్ కోసం కొరటాల కూడా ఎదురు చూస్తున్నారు.

ఈయన ఎప్పుడెప్పుడు ఇండియా వస్తే షూట్ స్టార్ట్ చేద్దామా అని కొరటాల అండ్ టీమ్ చూస్తున్నారు.ఎట్టకేలకు తారక్ ఇక్కడకు రావడంతో మరి అతి త్వరలోనే ఎన్టీఆర్30 షూట్ స్టార్ట్ చేయనున్నారు.మొదటి షెడ్యూల్ కోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ ను సిద్ధం చేశారట.
ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆగకుండా షూట్ పూర్తి చేయనున్నారు.ఈ సినిమాను యువ సుధా ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు భారీగా స్థాయిలో నిర్మిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసి భారీ హైప్ తెచ్చుకున్నారు.







