ఇండియాలో ఎండాకాలం మొదలైన సమయం నుంచి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి.అయితే ఇండియాకి మాత్రమే కుక్కల దాడులు పరిమితం కాలేదు.
వేరే దేశాల్లో కూడా ఇది పేట్రేగిపోతున్నాయి.తాజాగా స్పెయిన్‌లోని వాలెన్సియా( Spain ) సమీపంలోని ఒక చిన్న పట్టణంలో 67 ఏళ్ల బ్రిటిష్ మహిళను పిట్‌బుల్( Pitbull ) కరిచి చంపేసింది.
ఈ సిటీ సమీపంలోని పొలంలో పిట్‌బుల్‌ను వదిలేశారు.అయితే దీని వద్దకు వెళ్లిన మహిళను ఆ కుక్క విచక్షణారహితంగా కరిచేసింది.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధురాలు మరణించింది.
షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ గుర్తు తెలియని మహిళ కొద్దిరోజుల పాటు కుక్కను ఇంటికి తీసుకొచ్చి పెంచింది.
అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ కుక్క ఒక్కసారిగా తనను పెంచి పోషించిన మహిళపైనే దాడి చేసింది.ఆమె ఇంటి నుండి అరుపులు వినిపించినప్పుడు ఎమర్జెన్సీ సర్వీస్‌లకు సహాయం కోసం కాల్ వచ్చింది.
సహాయం కోసం వచ్చిన కాల్‌కి స్పందించిన అధికారులతో పాటు సివిల్ గార్డ్ కూడా ఉన్నారు.మహిళను వాలెన్సియాలోని హాస్పిటల్ డి లా ఫేకి తీసుకెళ్లారు, అయితే ఆమె గాయాలతో మరణించింది.

ఆ మహిళ ఒంటరిగా జీవిస్తోందని, జంతువులపై మక్కువ ఎక్కువని స్థానిక మీడియా పేర్కొంది.ఆమె 2005 నుండి పట్టణంలో నివసిస్తోంది.ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.ఆమె నివసించిన పట్టణానికి చెందిన మేయర్ ఆ మహిళ సుపరిచితురాలు, స్నేహశీలి అని పేర్కొన్నారు.ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతుండగా, కుక్క దాడికి కారణమేమిటో తెలియరాలేదు.







