రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన భవిష్యత్తు గ్యారంటీ బస్సు యాత్ర పెద్దాపురం నియోజక వర్గం లో ఉత్సాహంగా సాగింది.అడుగడుగునా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఉపముఖ్యమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప నేతృత్వంలో చేపట్టిన బస్సు యాత్ర కు ఘనస్వాగతం పలికారు.
పూర్ణ కళ్ళాణమండపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, జవహర్,పీతల సుజాత,చిక్కాల రామచంద్రరావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజుతో పాటు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు
.






