ఏపీ రైతుల కోసం కొత్త చట్టం తీసుకురాబోతున్న ప్రభుత్వం..!!

శుక్రవారం తాడేపల్లి సీఎం కార్యాలయంలో వ్యవసాయం, ఉద్యాన శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

విషయంలోకి వెళ్తే రైతుల పంటలకు( Crops ) కనీస మద్దతు ధర కల్పనకు చట్టం తీసుకురాబోతున్నట్లు స్పష్టం చేశారు.ఈ కొత్త చట్టంతో ఏపీలో ఆక్వా, డెయిరీ ఉత్పత్తి రైతులకు( Farmers ) రక్షణ కల్పించే రీతిలో చర్యలు తీసుకోబోతున్నారట.

ఈ క్రమంలో రైతుల దగ్గర నుంచి ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలు, సంస్థలు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా MSP ధరలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.కౌలు రైతులకు రైతు భరోసా సాయం అందేలా చూడాలని సూచించారు.ఇదే సమయంలో వ్యవసాయ రంగంలో డ్రోన్ వినియోగం పెంచాలని ఆదేశించారు.

డ్రోన్ టెక్నాలజీ( Drone Technology ) ద్వారా భూసార పరీక్షలలో ప్రయోజనాలు అందుకోవాలని సూచించారు.ఉత్పత్తుల కొనుగోలు అన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారానే జరగాలని అధికారులకు స్పష్టం చేశారు.

Advertisement

గోధుమలు, కోల్డ్ రూమ్స్ నిర్మాణంపై కూడా దృష్టి పెట్టాలని సీఎం జగన్ పేర్కొన్నారు.

ప్రభాస్ ను లైన్ లో పెడుతున్న్న స్టార్ డైరెక్టర్స్...వర్కౌట్ అవుతుందా..?
Advertisement

తాజా వార్తలు