ఏపీ అసెంబ్లీ సమావేశాలు( AP Assembly Sessions ) కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్( Governor Abdul Nazeer ) ప్రసంగించారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు.ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్న ఆయన విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్రంలోని విద్యారంగాన్ని బలోపేతం చేశామని పేర్కొన్నారు.పేద పిల్లకు గ్లోబల్ ఎడ్యుకేషన్( Global Education ) అందిస్తున్నామన్నారు.నాడు – నేడుతో( Nadu – Nedu ) ప్రభుత్వ స్కూళ్లకు కొత్త దశ వచ్చిందని తెలిపారు.దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యాసంస్కరణ చేపట్టామన్నారు.
తమ ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగు బడ్జెట్ లను ప్రవేశపెట్టిందని తెలిపారు.
నవరత్నాలను( Navarathnalu ) పక్కాగా అమలు చేస్తున్నామని చెప్పారు.అలాగే తమది పేదల పక్షపాత ప్రభుత్వమని, తమ ప్రభుత్వం వచ్చిన తరువాత పేదరికం 4.1 శాతానికి తగ్గిందని వెల్లడించారు.అణగారిన వర్గాలతో పాటు సమాజంలోని అన్ని వర్గాలు లబ్ధి పొందాయని వెల్లడించారు.