ప్రస్తుతం దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి.ప్రధానంగా కందిపప్పు , ఉల్లిగడ్డల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
ధరలు తగ్గించాలని ప్రజలు మొత్తుకుంటున్నారు.ఈ విషయంలో కేంద్రాన్ని ప్రతిపక్ష పార్టీలే కాకుండా భాజపా మిత్ర పక్షాలు కూడా విమర్శిస్తున్నాయి.
కొంతకాలంగా భాజపాను యమ తిప్పలు పెడుతున్న మిత్రపక్షం శివసేన ధరల పెరుగుదల అరికట్టడంలేదని ప్రభుత్వం మీద మండి పడుతోంది.ఉల్లిగడ్డ, పప్పుల ధరలు ఎందుకు నియంత్రించ లేక పోతున్నారని ప్రశ్నించింది.
గతంలో ఉల్లిగడ్డల ధర పెరిగినప్పుడు తగ్గించలేని ప్రభుత్వాలు కూలి పోయాయని, కేంద్ర ప్రభుత్వం ఆ విషయం గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించింది.ధరలు ఇలాగే పెరిగితే ప్రభుత్వం ప్రమాదంలో పడుతుందని తెలిపింది.
ఇక అయోధ్యలో రాముడి గుడి కట్టి తీరాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే కేంద్రాన్ని డిమాండ్ చేశారు.రాముడి కడతామని భాజపా వాగ్దానం చేసిందని, అది ఇప్పటివరకు నెరవేరలేదని థాకరే అన్నారు.
ముందు ధరలు తగ్గిస్తే అదే పదివేలు.రాముడి గుడి కట్టడం కంటే ఇది ప్రధానం.
వోట్ల కోసమే రాముడి గుడి కడతామని వాగ్దానం చేశారు కానీ నిజంగా కడతారా? అదే జరిగితే గొడవలు జరగడం ఖాయం.







