ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కనకమేడల విమర్శలు గుప్పించారు.ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ ధనాన్ని వినియోగిస్తున్నారని ఎంపీ కనకమేడల మండిపడ్డారు.జగన్ పాలనా వైఫల్యాలు అడుగడుగున కనబడుతున్నాయని తెలిపారు.
రాజకీయ పరంగా ప్రతిపక్ష నేతల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపితే అక్రమ కేసులు బనాయించడమే కాకుండా తమ నేతలను, కార్యకర్తలను జైళ్లకు పంపుతున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.