ఎన్నారై ఇన్వెస్టర్లకు భారీ రాబడి అందించే ప్రభుత్వ బాండ్లు ఇవే.. తప్పక తెలుసుకోండి!

ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) పెట్టుబడి పెట్టడానికి, రాబడిని సంపాదించడానికి గవర్నమెంట్ బాండ్స్‌( Government Bonds ) సురక్షితమైన మార్గం.ప్రాజెక్ట్‌లు, రోజువారీ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి ఈ బాండ్‌లను భారత ప్రభుత్వం జారీ చేస్తుంది.

 Government Bonds Nris Can Invest In To Grow Their Money Details, Government Bond-TeluguStop.com

ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారు నిర్దిష్ట కాలానికి నిర్ణీత వడ్డీ రేటును పొందవచ్చు.ఎన్నారైలు( NRI ) పెట్టుబడి పెట్టగల, ఎక్కువ రాబడి అందుకోగల ప్రభుత్వ బాండ్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1.పబ్లిక్ సెక్టార్ యూనిట్ (PSU), క్యాపిటల్ బాండ్స్‌:

ఇవి ట్యాక్స్ ఫ్రీ బాండ్‌లు, వాటిపై మీరు సంపాదించే వడ్డీ కూడా పన్ను రహితం.కానీ పెట్టుబడికి పన్ను మినహాయింపు ఉండదు.క్యాపిటల్ గెయిన్స్ బాండ్లు కొన్ని షరతులలో పన్ను మినహాయింపును అందిస్తాయి.

Telugu Bharat Bond Etf, Bonds, Fixed Interest, Nris, Rbi Nri Bonds, Tax Bonds-Te

2.సురక్షిత కార్పొరేట్ బాండ్లు నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు (NCDs):

ఈ బాండ్‌లు కంపెనీలచే జారీ చేయబడతాయి, వివిధ కాల వ్యవధిని కలిగి ఉంటాయి.వీటిని వివిధ మార్కెట్లలో ట్రేడ్ కూడా చేయవచ్చు.

3.డెట్ మ్యూచువల్ ఫండ్స్:

ఎన్నారైలు ఈ ఫండ్స్‌లో వారి నాన్-రెసిడెంట్ ఆర్డినరీ(NRO) లేదా నాన్-రెసిడెంట్ ఎక్స్‌టర్నల్(NRE) ఖాతాల నుండి పెట్టుబడి పెట్టవచ్చు.ఇవి స్థిర వడ్డీ రేటును ఆఫర్ చేస్తాయి.

4.జీరో-కూపన్ బాండ్స్‌:

ఈ బాండ్‌లు తగ్గింపు ధరకు సేల్ అవుతాయి.మెచ్యూరిటీ తర్వాత లాభాలను అందిస్తాయి.

Telugu Bharat Bond Etf, Bonds, Fixed Interest, Nris, Rbi Nri Bonds, Tax Bonds-Te

5.ఆర్‌బీఐ ఎన్నారై బాండ్స్‌:

భారతీయ రిజర్వ్ బ్యాంక్( RBI ) ఈ బాండ్లను వివిధ కాలాలు, వడ్డీ రేట్లతో జారీ చేస్తుంది.

6.భారత్ బాండ్ ETF లేదా FOF:

ఇవి సురక్షితమైన పెట్టుబడులుగా పేరు తెచ్చుకున్నాయి అంతేకాదు మంచి రాబడిని కూడా అందిస్తాయి.అవి ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలచే జారీ చేయబడిన ట్రేడబుల్ డెట్ ఈటీఎఫ్‌లు లేదా బాండ్‌లు.

ఎన్నారైలు తమ డబ్బును పెట్టుబడి పెట్టడానికి, కాలక్రమేణా వృద్ధి చెందడానికి ఈ ఎంపికల నుంచి ఒకదానిని ఎంచుకోవచ్చు.ప్రభుత్వ పథకాలకు మద్దతు ఇస్తూనే రాబడిని పొందేందుకు ఇది మంచి మార్గం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube