'ఖుషి'పై విజయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ట్రైలర్ రాబోతుందని అలా క్లారిటీ!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ప్రజెంట్ ఫుల్ స్వింగ్ లో తన సినిమాలను ప్రకటిస్తూ వాటిని పూర్తి చేస్తున్నాడు.మరి రౌడీ స్టార్ విజయ్ నటిస్తున్న మూవీల్లో ‘ఖుషి’ ఒకటి.

 Vijay Devarakonda Khushi Trailer Update, Vijay Devarakonda, Khushi Movie, Shiva-TeluguStop.com

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.దీంతో ఆయన ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

గత రెండు సినిమాలతో విజయ్ అందుకున్న పరాభవాన్ని మరిపించేలా ఖుషి విజయం సాదించాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఈ క్రమంలోనే విజయ్ నుండి నెక్స్ట్ రాబోతున్న ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

లైగర్ వంటి భారీ ప్లాప్ తర్వాత విజయ్ ”ఖుషి” ( Khushi ) చేస్తుండగా ఈ సినిమాలో విజయ్ కు జంటగా సమంత( Samantha ) హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ జంటను తెరమీద చూడాలని తెలుగు ఆడియెన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే వచ్చిన పాటలు వీరి కెమిస్ట్రీని అందంగా చూపించడమే కాకుండా మరిన్ని అంచనాలు పెంచేసాయి.ఇప్పటికే షూట్ కంప్లీట్ కాగా ప్రమోషన్స్ లో మరింత స్పీడ్ పెంచాలని చూస్తున్నారు.

ఇక ఈ సినిమా నుండి ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్./br>

తాజాగా విజయ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ 8 రోజులు, 14 రోజులు, 30 రోజులు అంటూ విజయ్ దేవరకొండ ఒక ట్వీట్ చేయగా ఇందులో 8 రోజులు అనేది ట్రైలర్ రిలీజ్ డేట్ అని అంతా ఫిక్స్ అయ్యారు.ఇక 14 రోజులు అంటే ఏంటో తెలియాల్సి ఉంది.30 రోజులు అంటే రిలీజ్ డేట్ అని తెలుస్తుంది.మొత్తానికి విజయ్ అలా హింట్ ఇచ్చేసాడు.ట్రైలర్ తో ప్రమోషన్స్ మరింత జోరుగా స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.ఆగస్టు 9న ఈ ట్రైలర్ రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.ఇక మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది.

మరి ఈ లవ్ స్టోరీ విజయ్ కు ఎలాంటి హిట్ ఇస్తుందో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube