తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన అంతా శుభం జరగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.ఇవాళ్టి ఫలితాలపై బాధపడేది లేదన్న ఆయన ఆశించిన ఫలితాలు సాధించడంలో గురి తప్పిందని పేర్కొన్నారు.
ఓటమి నుంచి తాము నేర్చుకుంటామని, తిరిగి బలంగా పుంజుకుంటామని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.ఈ క్రమంలోనే హ్యాట్రిక్ సాధిస్తామనుకున్న తమ గురి తప్పిందంటూ ట్వీట్ చేశారు.
మరోవైపు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కేటీఆర్ విజయం సాధించారు.