సీటీమార్ కొట్టేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న గోపీచంద్

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సీటీమార్’ గతంలోనే రిలీజ్‌కు రెడీ అయ్యింది.

కానీ ఈ సినిమాను దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

అయితే ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ ఆట కోచ్‌గా కనిపిస్తుండటం, ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు ఈ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి.కాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.

Gopichand Seetimaarr Release Date Locked, Gopichand, Seetimaarr, Tamannaah, Samp

సీటీమార్ చిత్రాన్ని సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.

ఇక ఈ సినిమాతో గోపీచంద్ సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని గట్టిగా చూస్తున్నాడు.ఈ సినిమాను పక్కా కమర్షియల్ అంశాలతో పూర్తి ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు సంపత్ నంది తీర్చిదిద్దాడు.

Advertisement

కాగా ఈ సినిమాలో గోపీచంద్ సరసన అందాల భామ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది.కాగా ఓ కీలక పాత్రలో దిగంగనా సూర్వవంశీ కూడా నటిస్తోంది.

ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీన్స్‌లో గోపీచంద్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు.సంపత్ నంది తెరకెక్కి్స్తున్న ఈ సినిమాలో తమన్నా ‘జ్వాలా రెడ్డి’ అనే పాత్రలో నటిస్తోంది.

ఈ పాత్ర తమన్నా కెరీర్‌లో బెస్ట్ పాత్రగా ఆమెకు కలిసొస్తుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.అయితే ఈ సినిమాను దసరా కంటే ముందే రిలీజ్ చేసి సక్సెస్ కొటటాలని చిత్ర యూనిట్ వేసిన ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు అభిమానులు.

ఏదేమైనా సీటీమార్ కొట్టేందుకు గోపీచంద్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ముక్కు దిబ్బడతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసం!
Advertisement

తాజా వార్తలు