టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సీటీమార్ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.ఈ సినిమాను స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ కోచ్‌గా కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇక ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తికావడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
దర్శకుడు సంపత్ నంది ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో తమన్నా, గోపీచంద్‌ల మధ్య సన్నివేశాలు, కబడ్డీ ఆటకు సంబంధించిన సీన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాతో గోపీచంద్ చాలా కాలం తరువాత హిట్ కొట్టి తీరుతాడని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
కాగా ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 2న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
గతేడాదే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా కారణంగా అది వాయిదా పడింది.అయితే ఇప్పుడు వరుసగా తెలుగు సినిమాలు రిలీజ్‌కు క్యూ కడుతున్నాయి.
దీంతో ఏయే సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌లుగా నిలుస్తాయో, ఏ సినిమాలు ఫట్ అంటాయో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.ఇక సీటీమార్ చిత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో, ఈ సినిమాపై సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రేయిట్ అవుతున్నాయి.
మరి సీటీమార్ చిత్రంతో గోపీచంద్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.







