గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరక్షన్ లో వస్తున్న సినిమా సీటీమార్.కబడ్డి బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
సినిమాకు మణిశర్మ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది.సెప్టెంబర్ 10న థియేట్రికల్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా లేటెస్ట్ గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
సెన్సార్ వారు గోపీచంద్ సీటీమార్ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ అందించారు.అంతేకాదు సినిమా 138 నిమిషాల రన్ టైం ఉంటుందని తెలుస్తుంది.
మాస్ డైరక్టర్ గా సంపత్ నందికి మంచి క్రేజ్ ఉంది.అయితే కెరియర్ లో డైరక్టర్ గా వెనకపడ్డ సంపత్ నంది.
హీరోగా హిట్లు లేక గోపీచంద్ ఇద్దరు కలిసి కసితో ఈ సినిమా చేశారు.ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు గోపీచంద్.
రిస్క్ అయినా సరే థియేట్రికల్ రిలీజ్ కే వారు ఓటు వేశారు.మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
ఈ సినిమాతో పాటుగా మారుతి డైరక్షన్ లో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు గోపీచంద్. మారుతి సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్నట్టే.
అందుకే సీటీమార్ తో హిట్ కొట్టి మారుతి సినిమాతో కెరియర్ ట్రాక్ లోకి తెచ్చుకోవాలని చూస్తున్నాడు గోపీచంద్.