టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా లౌక్యం వంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రామబాణం‘.గోపీచంద్ సాలిడ్ హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో ఈయన ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.2014లో లౌక్యం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.అయితే ఆ రేంజ్ లో మరో హిట్ అయితే ఈయన ఖాతాలో ఇంత వరకు పడలేదు.
దీంతో ఈ రేంజ్ హిట్ కోసం గోపీచంద్ చాలానే కష్ట పడుతున్నాడు.కానీ ఫలితం మాత్రం రావడం లేదు.పక్కా కమర్షియల్ కంటే ముందు సీటీమార్ సినిమాతో ఒక మాదిరి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.కానీ మళ్ళీ పక్కా కమర్షియల్ తో ప్లాప్ పడింది.
అందుకే ఈసారి చేసే సినిమా మంచి హిట్ అవ్వాలని పట్టుదలతో తన నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసాడు.

ప్రెజెంట్ గోపీచంద్ ‘రామబాణం‘ సినిమా చేస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఆడియెన్స్ ను అలరించాయి.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు మేకర్స్.
రామబాణం సినిమాను మే 5న సమ్మర్ కానుకగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్టు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.

ప్రజెంట్ స్టూడెంట్స్ అందరు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సమయం కావడంతో రామబాణం మేకర్స్ కూడా పోస్టర్ మీద అందరు చక్కగా చదివి పరీక్షలు రాయాలని.అలానే వేసవి సెలవుల్లో అందరం కలుద్దాం అంటూ అనౌన్స్ చేయడం అందరిని ఆకట్టు కుంది.ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, ఖుష్బూ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తుండగా.
మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తుంది.
చూడాలి రామబాణం ఎలాంటి హిట్ అందుకుంటుందో.








