పదివేల కోసం ఆ డైరెక్టర్ కి ఫోన్ చేసిన గోపీచంద్.. షాకింగ్ సమాధానం చెప్పిన డైరెక్టర్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా విలన్ గా ఎంతో మంచి గుర్తింపు పొందిన గోపీచంద్ తాజాగా నటించిన పక్కా కమర్షియల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశిఖన్నా హీరోయిన్ పాత్రలో సందడి చేశారు.

 Actor Gopichand Prank Call To Director Maruthi And Asking Money,actor Gopichand,-TeluguStop.com

ఇకపోతే ఈ సినిమా జులై 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న గోపీచంద్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

పక్కా కమర్షియల్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎక్కువగా డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుందని తెలుస్తోంది.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్ కి యాంకర్ నుంచి వింత ప్రశ్న ఎదురయింది.ఈ సందర్భంగా యాంకర్ ప్రశ్నిస్తూ మీరు ఎవరికైనా ఫోన్ చేసి ఒక నిమిషంలో మీ అకౌంట్ కు పదివేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయమని అడగండి అని చెప్పారు.

ఎవరికైనా చేయవచ్చు అలా అడిగిన వెంటనే మీకు పదివేల రూపాయలు ఎవరు వేస్తారో ప్రయత్నించండి అని చెప్పారు.

Telugu Gopichand, Maruthi, Pakka, Rashi Khanna, Tollywood-Movie

ఈ క్రమంలోనే గోపీచంద్ డైరెక్టర్ మారుతి గారికి ఫోన్ చేశారు.తనకు అర్జెంటుగా పది వేలు కావాలని అడగడంతో మారుతి ఏంటన్నా అలా అడిగారు, ఏదో 10 లక్షలు కావాలని అడుగుతున్నట్టు అడుగుతున్నారు.ఇప్పుడే మీకు పంపిస్తాను అంటూ సమాధానం చెప్పారు.

ఇలా అడిగిన వెంటనే మారుతి గారు డబ్బులు పంపించారు.ఇలా చిత్రబృందం పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube