నందమూరి బాలకృష్ణ హీరోగా క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా NBK107.బాలకృష్ణ అఖండ సినిమాతో అఖండమైన విజయం అందుకున్నాడు.
చాలా రోజుల తర్వాత హిట్ రావడంతో ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఈ సినిమా స్టార్ట్ చేసి అదే ఉత్సాహంతో పూర్తి కూడా చేస్తున్నాడు.
గోపిచంద్ మలినేని కూడా క్రాక్ వంటి సూపర్ హిట్ అందుకున్న తర్వాత బాలయ్యతో సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై నందమూరి ప్రేక్షకులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి బాలయ్య లుక్ రివీల్ అయ్యింది.ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఇటీవలే టర్కీలో షూట్ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చిన టీమ్ త్వరలోనే మరొక షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం.ఈ కొత్త షెడ్యూల్ లో బాలయ్యకు సంబందించిన షూట్ ను పూర్తి చేయనున్నట్టు తెలుస్తుంది.

తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం అక్టోబర్ ఫస్ట్ వీక్ లో ఈ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.
అలాగే ఫాస్ట్ గా పూర్తి చేసి సంక్రాంతి లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంటే.కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.







