గోపీచంద్ తో కూడా చిందేయనున్న ఊర్వశి రౌటేలా.. ఏ సినిమాలో అంటే?

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా( Urvashi Rautela ) ఈ మధ్య టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ భామ వరుసగా ఐటెం సాంగ్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది.

 Gopichand And Director Srinu Vaitla Movie Update, Gopichand, Director Srinu Vait-TeluguStop.com

ఈమె ముందుగా మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాలో ఐటెం సాంగ్ చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్నగా కాలుమోపింది.ఇక ఆ తర్వాత ఈ భామకు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.

అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీలో ఓ సాంగ్, సాయి తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బ్రో’ సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసి మెప్పించింది.ఇక అతి త్వరలోనే రిలీజ్ కాబోతున్న బోయపాటి, రామ్ స్కంద సినిమా( Skanda )లో కూడా ఈ భామ చిందేసింది.

మరి ఇప్పుడు ఈమెకు మరో ఆఫర్ వచ్చినట్టు తాజాగా సమాచారం అందుతుంది.దీంతో ఈమె అతి త్వరలో గోపీచంద్ తో కూడా చిందేయనున్నట్టు టాక్.

Telugu Bollywood, Srinu Vaitla, Gopichand, Gopichandsrinu, Ramabanam, Tollywood,

మ్యాచో స్టార్ గోపీచంద్( Gopichand ) హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పోతాడు.గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.ఇటీవలే రామబాణం చేయగా అది కూడా ఆకట్టుకోలేక పోయింది.ఇక ప్రస్తుతం డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో భీమా సినిమా చేస్తున్నాడు.దీంతో పాటు మరో కొత్త సినిమాను ప్రకటించాడు.కామెడీ అండ్ యాక్షన్ సినిమాల డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక సినిమాను ప్రకటించారు.

Telugu Bollywood, Srinu Vaitla, Gopichand, Gopichandsrinu, Ramabanam, Tollywood,

ఈ సినిమా ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.చిత్రాలయం స్టూడియోస్ సంస్థపై వేణు దోనేపూడి నిర్మిస్తుండగా టైటిల్ గురించి అప్డేట్ ఒకటి వైరల్ అయ్యింది.ఈ సినిమాకు ”విశ్వం” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు టాక్.ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండగా ఇందుకోసం ఊర్వశిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.

ఈమెతో సాంగ్ చేయిస్తే సినిమాకు హైప్ కూడా పెరుగుతుందని అనుకుంటున్నారట.చూడాలి ఈ భామ ఈ సినిమాలో చిందేయడానికి ఒప్పుకుంటుందో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube