యాక్షన్ హీరో గోపీచంద్ ( Gopi Chand ) ఇటీవల వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నప్పటికీ పెద్దగా తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నారు.ఇక ఈయనకు హిట్ పడి చాలా కాలం అవుతుంది.
ఇకపోతే ప్రస్తుతం గోపీచంద్ ఒక సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.ఇక త్వరలో గోపీచంద్ భీమా సినిమా( Bheema Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇక ఈ సినిమా మార్చి 8వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా గోపీచంద్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి అప్డేట్స్ ట్రైలర్ కనుక చూస్తే ఈ సినిమా ద్వారా గోపీచంద్ హిట్ కొడతారని స్పష్టంగా అర్థం అవుతుంది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన తన కథ సినిమాల గురించి కూడా మాట్లాడారు.చివరిగా రామబాణం ( Ramabanam ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఇక ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలను ఈ సందర్భంగా గోపీచంద్ తెలిపారు.
రామబాణం సినిమా సక్సెస్ కాకపోవడానికి కారణం లేకపోలేదని తెలిపారు.ఈ సినిమాలో ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు.ఈ విషయం మాకు సినిమా షూటింగ్ మధ్యలోనే అర్థమైందని కథ ఎంత పాతది అయినప్పటికీ ఎమోషన్స్ వర్కౌట్ కాకపోతే ఆ సినిమా కూడా వర్కౌట్ కాదని ఈయన తెలిపారు.
ఆ చిత్రాన్ని ప్రజెంట్ చేసిన విధానంలోనే లోపం జరిగింది అనిపిస్తోంది.ఆ విషయంలో డైరెక్టర్ శ్రీవాస్ ని( Director Sriwass ) తప్పుపట్టలేం.ఎందుకంటే ఇలా వర్క్ అవుతుందేమో అని ఆయన నమ్మారు.కానీ అది జరగలేదు ఇందులో డైరెక్టర్ తప్పు ఏమాత్రం లేదు అంటూ గోపీచంద్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.