గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్( Google Pixel 9 ) డిజైన్ 5K రెండర్ ల ద్వారా లీక్( Renders Leak ) చేయబడింది.లీక్ అయిన సమాచారం ప్రకారం.
పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో XL స్మార్ట్ ఫోన్లు ఒకేసారి త్వరలోనే లాంచ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది.గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లో ఉండే స్మార్ట్ ఫోన్లు అన్ని దాదాపుగా ఒకే విధమైన డిజైన్ విధానాన్ని కలిగి ఉండనున్నాయి.
ఈ డిజైన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గుర్తింపును బలోపితం చేయనుంది.పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్ 6.03 అంగుళాల డిస్ ప్లే, పిక్సెల్ 9 ప్రో స్మార్ట్ ఫోన్ 6.1 అంగుళాల డిస్ ప్లే, పిక్సెల్ 9ప్రో XL స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల డిస్ ప్లే తో వస్తోంది.
పిక్సెల్ 9 సిరీస్ డిజైన్( Google Pixel 9 Design ) విషయానికి వస్తే.ఇది వెనుక వైపు రెండు కెమెరాలతో కాస్త విభిన్నంగా ఉంటుంది.పిక్సెల్ 9ప్రో, పిక్సెల్ 9ప్రో XL స్మార్ట్ ఫోన్లు ఒక్కొక్కటి మూడు రియల్ షూటర్లను కలిగి ఉంటాయి.
పిక్సెల్ 9 సిరీస్ టెన్సర్ G4 చిప్ సెట్( G4 Chipset ) ద్వారా శక్తి పొందనుంది.ఇక ఈ గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ కు సంబంధించిన మరిన్ని స్పెసిఫికేషన్ వివరాలు అక్టోబర్ 2024లో వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇక ఈ సిరీస్ ఈ 2024 చివర్లో భారత మార్కెట్లో విడుదల అయ్యే అవకాశం ఉంది.
స్టైలిష్ లుక్( Stylish Look ), అద్భుతమైన డిజైన్, ఆకర్షణీయమైన ఫీచర్లతో త్వరలో భారత మార్కెట్లో విడుదల కానున్న గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్, మిగతా స్మార్ట్ ఫోన్ల కొనుగోల్లకు గట్టి పోటీ ఇస్తుందని సంస్థ భావిస్తోంది.ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర వివరాలు లాంచింగ్ సమయంలో తెలియనున్నాయి.