వినియోగదారులకు కొత్త సర్వీసులు తీసుకవచ్చిన గూగుల్ పే..!

టెక్నాలజీ ఎంతలా అభివృద్ధి చెందిందో ఎవరికీ తెలీదు.ఆన్ లైన్ బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా బ్యాంక్ కి వెళ్లకుండా ఇంట్లో ఉండే పనులు చేసుకోవచ్చు.

ప్రముఖ ఆన్ లైన్ పేమెంట్స్ ఫ్లాట్ ఫామ్ లలో ఒకటైన గూగుల్ పే ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ యూజర్లకు మరింత చేరువ అవుతున్న సంగతి తెలిసిందే.తాజాగా గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.

ఇక అతి త్వరలో కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడానికి గూగుల్ పే సిద్ధమైంది.ఈ కొత్త ఫీచర్ ద్వారా సులువుగా ట్రాన్సాక్షన్ వివరాలను మేనేజ్ చేయడం సాధ్యమవుతుందని సంస్థ యాజమాన్యం వెల్లడించారు.

గూగుల్ పే కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది.దీని వల్ల గూగుల్ పే యూజర్లకు ప్రయోజనం కలుగనుంది.

Advertisement

ఎక్కువ సౌలభ్యం లభంచనుంది.ట్రాన్సాక్షన్ వివరాలను సులభంగా మేనేజ్ చేయొచ్చు.

ఇండివీజువల్ ట్రాన్సాక్షన్లను చూసుకోవడం, వాటిని డిలేట్ చేసుకోవడం చేయొచ్చు.ఇంకా పర్సనలైజేషన్ ఆప్షన్‌ను ఆఫ్, ఆన్ చేసుకోవచ్చు.

వచ్చే వారం నుంచి గూగుల్ పే యాప్ సెట్టింగ్స్‌లో కొత్త ఫీచర్‌ను గమనించొచ్చు.గూగుల్ పే యాప్ కొత్త వెర్షన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పర్సనలైజేషన్ కంట్రోల్‌ ఆప్షన్‌ను ఆఫ్, ఆన్ చేసుకోవచ్చు.

ఒకవేళ ఈ ఆప్షన్ ఆన్ చేసుకుంటే పలు రకాల సౌలభ్యాలు పొందొచ్చు.యాప్‌లో మీ ట్రాన్సాక్షన్ హిస్టరీ, యాక్టివిటీకి అనుగుణమైన ఆఫర్లు, రివార్డు వంటివి కనిపిస్తాయి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

అదే మీరు ఈ సెట్టింగ్‌ను ఆఫ్ చేసుకుంటే గూగుల్ పే ఎప్పటి లాగానే పని చేస్తుంది.పర్సనలైజేషన్ సౌలభ్యాలు పొందలేరు.

Advertisement

ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌పై గూగుల్ పే యాప్‌ను అప్‌డేట్ చేసుకున్న తర్వాత పర్సనలైజేషన్ సెట్టింగ్స్‌ను మీకు నచ్చినట్లు మార్చుకోవచ్చు.గూగుల్ పేతో పాటు ఫోన్ పే, భీమ్ లాంటి యాప్ లను కూడా ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు.

నోట్లరద్దు తరువాత డిజిటల్ పేమెంట్ యాప్ ల వినియోగం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

తాజా వార్తలు