సూపర్ ఫీచర్ని పరిచయం చేసిన గూగుల్... ఏఐ సాయంతో టైప్ చేసేయొచ్చు!

ఈమధ్య గూగుల్( Google ) మంచి దూకుడుతో యూజర్స్( users ) కోసం సరికొత్త సర్వీసులను ప్రవేశపెడుతూ ముందుకు దూసుకుపోతోంది.ఈ క్రమంలోనే తాజాగా మరో ఏఐ ఎనేబుల్డ్ అప్‌డేట్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు భోగట్టా.

 Google Introduced A Super Feature You Can Type With The Help Of Ai, Google, Tech-TeluguStop.com

యూజర్ల టెక్ట్స్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగు పరిచేందుకు ‘మ్యూజిక్ కంపోజ్’ ఫీచర్‌ను లాంచ్ చేసింది గూగుల్.ఆండ్రాయిడ్( Android ) వినియోగదారుల కోసమే ఈ కొత్త స్పెసిఫికేషన్‌ను గూగుల్ డెవలప్ చేసినట్టు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతానికి అమెరికా ఆండ్రాయిడ్ యూజర్లకు బీటా వెర్షన్స్‌లో ఇది అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది.

Telugu Google, Introduced, Ups, Ai, Type-Latest News - Telugu

త్వరలోనే మిగతా దేశాల్లో కూడా ఈ ‘మ్యూజిక్ కంపోజ్’( Magic Compose ) ఫీచర్‌ను ప్రవేశ పెట్టనుంది గూగుల్.మెసేజ్ యాప్‌లో యూజర్‌కి మెసేజింగ్‌లో తోడ్పడేందుకు ఈ ‘మ్యూజిక్ కంపోజ్’ ఆప్షన్ ఉపయోగపడనుంది.అంటే యూజర్లు పంపించే మెసేజ్ లేదా రిప్లైలను ఏ శైలిలో ఇస్తే బాగుంటుందో అది సూచిస్తుంది.

కాగా మ్యాజిక్ కంపోజ్‌లో 7 రకాల స్టైల్స్ వున్నట్టు తెలుస్తోంది.ఫార్మల్, చిల్, రీమిక్స్, షేక్‌స్పియర్, ఎక్సైటెడ్, షార్ట్, లిరికల్ స్టైల్స్‌లలో మెసేజ్‌లు చేసే వీలు కల్పిస్తోంది.

అంటే, గర్ల్‌ఫ్రెండ్‌కి కవితాత్మకంగా, స్నేహితునికి సరదాగా, బంధువులకు ఆసక్తికరంగా మెసేజ్‌లను పంపించొచ్చన్నమాట.

Telugu Google, Introduced, Ups, Ai, Type-Latest News - Telugu

కాగా గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ ‘బార్డ్’ను మెసేజింగ్ యాప్‌లో ప్రవేశ పెట్టింది.ఈ మ్యాజిక్ కంపోజ్ ఫీచర్‌ను వాడాలంటే ముందుగా సెట్టింగ్స్‌ మెనూలోకి వెళ్లి ఎనేబుల్ చేసుకోవలసి ఉంటుంది.వచ్చిన మెసేజ్‌లకు భిన్నమైన టోన్‌లో రిప్లై ఇచ్చేందుకు ఇక్కడ యూజర్‌కి మ్యాజిక్ కంపోజ్ ఫీచర్ హెల్ప్ చేస్తుందని అర్ధం చేసుకోవాలి.

గూగుల్ మెసేజింగ్ యాప్‌లోనే ఆర్‌సీఎస్(రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్) కన్వర్సేషన్‌ల కోసమే మ్యాజిక్ కంపోజ్ ఫీచర్‌ను ప్రత్యేకంగా డెవలప్ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube