గూగుల్ ఏఐ చాట్‌బాట్ బార్డ్ (Bard) అద్భుతమైన సామర్థ్యాలతో బాగా పాపులర్ అయ్యే తాజాగా దీనికి మరికొన్ని ఫీచర్లను గూగుల్ యాడ్ చేసి మరింత సమర్థవంతంగా మార్చింది.ఆ కీలకమైన అప్‌డేట్‌లను ఇప్పుడు చూద్దాం.
1.రియల్-టైమ్ రెస్పాన్సెస్
బార్డ్ ఇప్పుడు యూజర్ ప్రశ్నలకు రియల్-టైమ్ రెస్పాన్సెస్( Real Time Response ) అందిస్తుంది.మొత్తం రెస్పాన్స్ కోసం వేచి ఉండటానికి బదులుగా, యూజర్లు సమాధానాలు టైప్ చేస్తూ ఉండగా వాటిని చూడగలరు.ఈ డైనమిక్ విధానం ఇంట్రాక్టివ్ యాక్షన్స్ వేగవంతం చేస్తుంది.సంభాషణల సమయంలో ఇన్‌స్టంట్ ఫీడ్ బ్యాక్ నిర్ధారిస్తుంది.
2.స్కిప్ అన్‌హెల్ప్‌ఫుల్ రెస్పాన్సెస్
అన్ని రెస్పాన్సెస్( Responses ) వ్యాలుబుల్ కాదని గుర్తించినప్పుడు గుర్తించినప్పుడు దానిని స్కిప్ చేసుకునే విధంగా బార్డ్ “స్కిప్ రెస్పాన్స్” ఫీచర్‌ను పరిచయం చేసింది.దీనివల్ల చాలా టైమ్ ఆదా అవుతుంది.

3.రెస్పాన్సెస్ మోడ్స్
వినియోగదారులు ఎంచుకోవడానికి రెండు రెస్పాన్సెస్ మోడ్‌లు ఉన్నాయి.ఇందులో మొదటిది రియల్ టైమ్ రెస్పాన్సెస్.( Real Time Response ) ఈ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే వినియోగదారులు సమాధానాలు రూపొందిస్తుండగా వాటిని స్వీకరిస్తారు.
రెండవ మోడ్ రెస్పాండ్ వెన్ కంప్లీట్. ఈ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఒకేసారి జనరేట్ అయిన రెస్పాండ్ కనిపిస్తుంది.ఆ సమయం వరకు యూజర్లు వెయిట్ చేయాలి.

4.క్రాస్-చెకింగ్
విశ్వసనీయతను మెరుగుపరచడానికి, వినియోగదారులు గూగుల్ సెర్చ్ నుంచి సమాచారంతో బార్డ్ సమాధానాలను క్రాస్-చెక్( Cross-Check ) చేయవచ్చు.దిగువ మెను బార్‌లో గూగుల్ లోగోను నొక్కడం రెస్పాన్స్ కచ్చితత్వాన్ని వెరిఫై చేయడానికి అనుమతిస్తుంది.
5.గూగుల్ యాప్స్‌తో కనెక్షన్
బార్డ్ వివిధ గూగుల్ యాప్‌లు, సేవలతో సజావుగా కలిసిపోతుంది.ఈ ఫీచర్‌తో యూట్యూబ్ వీడియో సంబంధిత వివరాలను తిరిగి పొందుతుంది.గూగుల్ విమానాలు, హోటల్‌లతో కనెక్ట్ అయి ప్రయాణ సంబంధిత ఎంక్వయిరీలతో సహాయం చేస్తుంది.







