ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ యూట్యూబ్ వాడుతున్నారు.యూట్యూబ్ లో గంటలకొద్దీ వీడియోలు చూస్తూ ఎంటర్ టైన్ అవుతున్నారు.
వినోదం కోసమే కాకుండా వీడియోలు పోస్ట్ చూసి యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించుకునేవారు ఎందరో ఉన్నారు.యూట్యూబ్ ఛానల్ ద్వారా వేల నుంచి లక్షల వరకు నెలకు సంపాదిస్తున్నారు.
యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అయి సినిమాల్లో అవకాశాలు కొట్టేసిన నటులు కూడా ఉన్నారు.
ఈ క్రమంలో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ అయిన యూట్యూబ్ ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది.
ఇప్పటికే టిక్ టాక్ తరహాలో షార్ట్స్ తీసుకురాగా.ఈ ఫీచర్ బాగా పాపులర్ అయింది.దీంతో పాటు యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ను కూడా యూట్యూబ్ అందుబాటులోకి తెచ్చింది.ఈ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే ఎక్స్‌క్లూజివ్ వీడియోలతో పాటు మధ్యలో యాడ్స్ లేకుండా వీడియోలను చూడవచ్చు.
దీంతో చాలా మొబైల్, టెలికాం కంపెనీలు యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌పై ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.అందులో భాగంగా తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మొబైల్ తయారీ సంస్థ షావోమీ యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌పై బంపర్ ఆఫర్ ప్రకటించింది.

షావోమీ, రెడ్ మీ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసినవారికి మూడు నెలల పాటు యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందించనుంది.అయితే ఎంపిక చేసిన కొన్ని మొబైల్స్ కు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది.
షావోమీ 11,12,11టి,11ఐ స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై ఈ ఆఫర్ ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకించారు.అలాగే రెడ్ మీ నోట్ 11, 11ఎస్ మొబైల్స్ పై కూడా ఆఫర్ అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.కాగా , ప్రస్తుతం యూట్యూబ్ ప్రీమియం ధర నెలకు రూ.129గా ఉంది.అయితే పలు టెలికాం సంస్ధలు దీనిపై పలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.







