కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే సూర్య సినిమా వచ్చిందంటే అభిమానుల హడావిడి మామూలుగా ఉండదు.
ఇక ఈయనకు తమిళంతో పాటు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది.తెలుగులో కూడా సూర్య సినిమాలకు విపరీతమైన ఆదరణ లభిస్తుందని చెప్పవచ్చు.
ఇకపోతే తాజాగా సూర్య కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో అతిథి పాత్రలో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.క్లైమాక్స్ చివరి ఐదు నిమిషాలలో సూర్య నటన అద్భుతమనే చెప్పాలి.
ఈ సినిమాకు సూర్య పాత్ర కూడా చాలా హైలెట్ అయిందని పలువురు సూర్య పాత్ర గురించి తెలియజేశారు.కమల్ హాసన్ వంటి అగ్ర నటుడు సినిమాలో సూర్య చిన్న పాత్రలో కనిపించినప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.
అయితే తమ అభిమాన నటుడిని ఇలా స్క్రీన్ పై ఒక్కసారిగా చూడటంతో సూర్య అభిమానులు కాస్త అత్యుత్సాహం చూపించారు.ఈ క్రమంలోనే పెద్దఎత్తున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
పుదుచ్చేరిలోని ఒక థియేటర్లో విక్రమ్ సినిమా ప్రదర్శితమవుతుండగా అభిమానులు పెద్ద ఎత్తున సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే క్లైమాక్స్ సన్నివేశాలలో సూర్య స్క్రీన్ పై కనిపించగానే వెంటనే అభిమానులు సంతోషంలో థియేటర్ లో ఏకంగా టపాకాయలు పేల్చారు.

దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో మంటలు స్క్రీన్ కి అంటుకొని పెద్ద ఎత్తున స్క్రీన్ మొత్తం కాలిపోతుంది.సినిమా అలా రన్ అవుతూ ఉండగానే స్క్రీన్ మొత్తం కాలిపోయింది.ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో పెద్దఎత్తున ప్రేక్షకులు థియేటర్ల నుంచి పరుగులు పెట్టారు.వెంటనే అలర్ట్ అయిన థియేటర్ యాజమాన్యం మంటలను అదుపు చేసి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు ప్రారంభించారు.అయితే ఫాన్స్ చూపిన అత్యుత్సాహం కారణంగా కొన్ని లక్షలలో నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.







