తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.ఉద్యోగ నియామకాల్లో వయో పరిమితి( Age Limit ) పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( Telangana Government ) కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు వయో పరిమితి 44 నుంచి 46 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.అయితే త్వరలోనే కొలువుల జాతర మొదలు కానున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే పలు ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షల ఫలితాలను వెల్లడిస్తున్న ప్రభుత్వం.త్వరలోనే గ్రూప్ -1( Group -1 ) నోటిఫికేషన్ విడుదల చేయనుంది.అలాగే పోలీస్ శాఖలో మరో 15 వేల ఖాళీలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ డీఎస్సీ 2024 నోటిఫికేషన్( DSC 2024 Notification ) కూడా విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.