విద్యార్థులకు శుభవార్త: ఫోన్​ ద్వారా పాఠాన్ని స్కాన్‌ చేసి, వినవచ్చు.. తెలుసా?

కరోనా కాలం తరువాత ప్రపంచంలో చాలా మార్పు కనిపిస్తోంది.ఆఫీసుల్లో ఊపిరి సలపనంత బిజీగా వున్న ఉద్యోగులు తమ ఇంటినుండే ఉద్యోగాలు చేస్తున్నారు.

 Good News For Students: You Can Scan And Listen To The Lesson Through Your Phone-TeluguStop.com

అలాగే విద్యార్థులు ఆన్లైన్లో చదువులు చదువుతున్నారు.అదే ఒకప్పుడు పాఠాలు వినాలంటే కచ్చితంగా పాఠశాలకు వెళ్లి వినాల్సిందే.

ఒక్కోసారి తరగతి గదికి ఆలస్యంగా వెళ్తే ఆ పీరియడ్ మొత్తం బయట నిల్చోని నానా ఇబ్బందులు పడుతూ పాఠాలు వినవలసి వచ్చేది.అలాంటి రోజులు పోయాయి.

నేటి విద్యార్థులు అలాంటి కష్టాలేమి పడకుండా అరచేతిలో మొబైల్ ఉంటే ఏ పాఠమైనా వినేలా విద్యాశాఖ ఓ సరికొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టింది.

సరిగ్గా దాన్ని అమలు చేస్తోంది ఓ స్కూల్.

మహబూబ్​నగర్​లో జరిగిన ఓ సంఘటన ఓ మీడియా కెమెరా కంటికి చిక్కడంతో ఈ కధనం వెలువడింది.అక్కడ విద్యార్థులకు మరింత ప్రయోజనం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి సబ్జెక్టులో ప్రతి పాఠానికి క్యూఆర్‌ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసినదే.

కేంద్ర విద్యాశాఖ రూపొందించిన దీక్ష యాప్‌ను సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లైతే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి వీడియో రూపంలో ఆ పాఠాలను ఎంచక్కా వినవచ్చు.

ఇలా ప్రతి పాఠ్యాంశంలో ఒక్కో విషయానికి సంబంధించి 10 నుంచి 15 నిమిషాల నిడివితో నిపుణులైన ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాఠాలు రూపొందించబడ్డాయి.

ఇలా మిస్సైన పాఠ్యాంశాలను చూసి సులభంగా అర్థం చేసుకోవచ్చు.మహబూబ్‌నగర్‌లోని షాసాబ్‌గుట్ట ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదివే ఇద్దరు విద్యార్థినులు క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి పాఠాలు వింటుండగా కొన్ని దృశ్యాలు ఓ మీడియా ఛానల్ కి చిక్కడంతో ఈ విషయం బయటకు తెలిసినది.

కాబట్టి విద్యార్థులారా ఈ వెసులుబాటుని గమనించి ఉపయోగించుకోవాలని సూచిస్తున్నాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube