కేంద్ర ప్రభుత్వం వాహనదారుల కోసం ఫాస్ట్ టాగ్ విధానాన్ని అమలు లోకి తీసుకొచ్చిన సంగతి అందరికి తెలిసిందే.తాజాగా వాహనదారులకు ఒక శుభవార్త తెలియచేసింది కేంద్రం.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ఫాస్ట్ టాగ్ గడువు తేదీని ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది.
దేశవ్యాప్తంగా అన్ని రహదారులలో ఉన్న టోల్ ప్లాజాల వద్ద ఉన్న రద్దీని అధిగమించేందుకు, వాహనదారుల సమయాన్ని ఆదా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జనవరి 1 నుంచి దేశ వ్యాప్తంగా ఫాస్ట్ టాగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొని రాబోతున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి విదితమే.
ఆ గడువుని కాస్త ఇప్పుడు ఫిబ్రవరి 15 వరకు పొడిగించినట్లు తెలిపింది కేంద్ర ప్రభుత్వం.
ఈ విధానాన్ని జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీజు చెల్లించేందుకు ప్రవేశపెట్టింది.ఈ ఫాస్ట్ టాగ్ ఉపయోగించడం వల్ల వాహనదారులు వేగంగా టోల్ ఫీజు చెల్లించడంతో చాలా సమయం సేవ్ అవుతుంది వినియోగదారులకు.

ఈ ఫాస్ట్ టాగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనదారులకు వాహన రిజిస్ట్రేషన్ వివరాలతో కలిసి ఉన్న ఒక బార్ కోడ్ ఉంటుంది.ఆ బార్ కోడ్ ను కార్ ముందు భాగంలో కానీ, అద్దానికి కానీ అతికించి పెట్టుకోవచ్చు.ఈ తరుణంలోనే వాహనం టోల్ ప్లాజా వద్ద కు వచ్చిన సమయంలో ప్రత్యేక యంత్రం ద్వారా బార్ కోడ్ ను స్కాన్ చేసి ఆటోమేటిక్ గా టోల్ ఫీజు కట్ అయిపోతుంది.దీనితో టోల్ ప్లాజాల గుండా వెళ్లే వాహనాలు చాలా సులువుగా ఫాస్ట్ గా వెళ్లే అవకాశం ఉంటుంది.
దీంతో ఎటువంటి నగదు కూడా చెల్లించవలసిన అవసరం లేదు.ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే త్వరగా చేసుకోండి.