కోహ్లీ అభిమానులకు శుభవార్త: మరో అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ!

విరాట్ కోహ్లీ పరిచయం అక్కర్లేదు.ఇండియన్ క్రికెట్ టీమ్ లోకి వచ్చిన నాటినుండి తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు.

 Good News For Kohli Fans , Virat Kohli , Cricket , Team , India Players , Comme-TeluguStop.com

దాంతో అనతికాలంలోనే భారత జట్టు క్రికెట్ టీమ్ కి కెప్టెన్ అయిపోయాడు.ఈ క్రమంలో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.

అందువలన కోహ్లీ అంటే ఇష్టపడని క్రికెట్ ప్రేమికుడు ఉండడు అనే చెప్పుకోవాలి.కాగా ఈ సీజన్‌ IPL RCB విరాట్ కోహ్లీ బ్యాట్ చాలా వరకు కూల్ గా ఉంది.

అయితే గురువారం గుజరాత్ టైటాన్స్‌పై మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ చేసి, తన పేరిట ఓ భారీ రికార్డును నమోదు చేసుకున్నాడు కోహ్లీ.కొన్నాళ్లుగా ఫామ్‌లో లేని కోహ్లీ, తాజాగా మరలా ఫామ్‌లోకి రావడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 54 బంతుల్లో మొత్తం 73 పరుగులు చేసి, వారెవ్వా అనిపించాడు.మొత్తం ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టి ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు.

IPLలో కోహ్లీ సిక్సర్‌తో 45వ అర్ధ సెంచరీని నమోదు చేసి రికార్డు సృష్టించాడు.ఈ నేపథ్యంలో టీ20 క్రికెట్‌లో ఫ్రాంచైజీ తరపున 7000 పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ విజయ దుందుభి మోగించాడు.RCB (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) తరపున విరాట్ కోహ్లి టీ20 క్రికెట్‌లో 7 వేల పరుగుల సంఖ్యను చేరుకున్నాడు.2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోహ్లీకి అనుబంధం ఉంది.

Telugu Indian Cricket, Cricket, Kohli Fans, India, Iplrcb, Rare, Virat Kohli-Lat

IPL 15 సీజన్‌లతో పాటు ఛాంపియన్స్ లీగ్‌లో బెంగళూరు తరపున ఆడాడు కోహ్లీ.ఈ కారణంగా, అతను 7 వేలకు పైగా పరుగులు సాధించాడు.కోహ్లితో పాటు బెంగుళూరు తరపున ఏబీ డివిలియర్స్ 4522 పరుగులు చేయగా, క్రిస్ గేల్ 3420 పరుగులు చేసి 3వ స్థానంలో ఉన్నాడు.ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఇన్నింగ్స్‌తో RCB 8 వికెట్ల తేడాతో విజయం దుందుభి మోగించింది.

ఈ విజయంతో కోహ్లీ ప్లేఆఫ్‌కు వెళ్లాలనే ఆశను సజీవంగా ఉంచుకుంది.ప్రస్తుతం ఢిల్లీ ఓడిపోతే ప్లేఆఫ్‌కు వెళ్లేందుకు ఛాన్స్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube