భారతీయులకు శుభవార్త..ఇప్పటి నుంచి ఇన్ని రోజులకే వీసా పాస్ పోర్ట్..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని భారత ప్రవాసులకు నిజంగా ఇది శుభవార్త అని చెప్పవచ్చు.

ప్రజలకు వారంలోని ఏడు రోజులు కూడా వీసా పాస్ పోర్ట్ సర్వీస్ లు అందుబాటులోకి వస్తున్నాయి.

ఆదివారాలు కూడా ఇకపై సంబంధిత కార్యాలయాలు తెరిచి ఉంటాయని వారంలోని మిగతా రోజుల్లో మాదిరిగానే ఇక్కడ దరఖాస్తుల స్వీకరణ ప్రాసెస్ ఉంటుందని వెల్లడించారు.దీనిలో భాగంగా పాస్ పోర్ట్, వీసా సంబంధిత సేవల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి ఇండియన్ అవుట్ సోర్సింగ్ సర్వీస్ ప్రొవైడర్ బి ఎల్ ఎస్ ఇంటర్నేషనల్ సర్వీస్ లిమిటెడ్ కేంద్రాలు ఆదివారంతో సహా వారానికి ఏడు రోజులు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

భారత 74 వ గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి మాట్లాడుతూ మీ శ్రేయస్సు సమక్షం కోసం పనిచేయడానికి మా నిబద్ధతను నేను పునరుద్ఘాటిస్తున్నాను.ఈ క్రమంలో గత వారం నుంచి పాస్ పోర్ట్, వీసా సేవల కోసం అవుట్ సోర్స్ సర్వీస్ ప్రొవైడర్ వారంలోని అన్ని రోజులు పనిచేస్తుందని వెల్లడించారు.అలాగే ఇప్పటినుంచి ఓపెన్ డోర్ విధానాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు.

దీని ద్వారా భారతీయ ప్రవాసులు అపాయింట్మెంట్ లేదా ముందస్తు నోటిఫికేషన్ లేకుండా ఏదైనా విషయానికి సంబంధించి తమ ఫిర్యాదును నమోదు చేసుకోవడానికి కాన్సులేట్‌ను సందర్శించవచ్చని వెల్లడించారు.

Advertisement

భారతీయ ప్రవాసుల డిమాండ్ ను తీర్చడానికి జనవరి 22 నుంచి అన్ని రోజుల్లో పాస్ పోర్ట్, వీసా సేవల కోసం దరఖాస్తు చేసుకోవడానికి దుబాయ్, షార్జా లో ఉన్న మూడు కేంద్రాలను తెరవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.అయితే ఆదివారాల్లో దరఖాస్తుదారులు అత్యవసర కేసులు మినహా అపాయింట్మెంట్ ప్రతిపాదికన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తును అవసరమైన సహాయక పత్రాలతో పాటు అందించాలని వెల్లడించారు.దీనికోసం దరఖాస్తుదారులుhttps://blsindiavisa-uae.com/appointmentbls/appointment.php ఈ లింకును ఉపయోగించి బిఎల్ఎస్ కేంద్రాలతో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలని వెల్లడించారు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు