ఈ ఏడాది అక్టోబర్ నుండి వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) మ్యాచ్ లు ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే.ఇండియాలో( India ) ఎక్కువగా మ్యాచ్ లు జరగనున్నాయి.2011లో ఇండియాలో నిర్వహించిన ప్రపంచ కప్ నీ ధోని సారధ్యంలో( MS Dhoni ) గెలవడం జరిగింది.మళ్లీ ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా ఇండియా వరల్డ్ కప్ గెలవలేదు.
దీంతో ఈసారి స్వదేశంలో జరగబోతున్న ప్రపంచ కప్ నీ గెలవాలని భారత్ క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే అక్టోబర్ నుండి మొదలు కాబోయే వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లకి సంబంధించి టికెట్లను బీసీసీఐ( BCCI ) విడుదల చేయడం జరిగింది.
బుక్ మై షో, ఐసీసీ వెబ్ సైట్ ల నందు టికెట్స్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.దీని తర్వాత మరో విడత టికెట్లను( ODI World Cup Tickets ) విక్రయించనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేయడం జరిగింది.
ఆల్రెడీ ఆగస్టు 24 తారీఖున మొదటి విడత టికెట్లు విడుదల చేయగా.హాట్ కేకుల మాదిరిగా అమ్ముడుపోయాయి.
నేడు రెండో విడతకు సంబంధించి టికెట్స్ విడుదల చేయడం జరిగింది.సెప్టెంబర్ 8.రాత్రి 8 గంటలు నుండి టికెట్స్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.







