ఏపీ పింఛన్ దారులకు గుడ్ న్యూస్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం నేడు సమావేశమైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పెన్షన్ విషయంలో క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందంట.

వచ్చే ఏడాది జనవరి నెల నుండి 2500 రూపాయలు ఇస్తున్న పెన్షన్ ₹2750కి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.పెంచిన పింఛన్ వచ్చే ఏడాది జనవరి నుండి అమలు కానున్నాయి.తాజా నిర్ణయం ద్వారా రాష్ట్రంలో 62.31 లక్షల మందికి లబ్ధి కలగనుంది.సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో దశలవారీగా పెన్షన్ పెంచుకుంటూ పోతామని హామీ ఇచ్చారు.

ఆరీతిగానే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో పెంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో పెంచిన పింఛన్లకు సంబంధించిన దానిపై ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేయడం జరిగింది.

ఆ తర్వాత దశల వారిగా పెంచుకుంటూ ₹2500 చేయడం జరిగింది.ఇదిలా ఉంటే వచ్చే ఏడాది జనవరి నుండి ₹2750 రూపాయలు ఇవ్వటానికి ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

Advertisement
వైసీపీ సీనియర్ల చూపు ఆ పార్టీ పై పడిందా ? 

తాజా వార్తలు