ఈ మధ్య కాలంలో కొందరు అడ్డదారుల్లో డబ్బు సంపాదించడం కోసం ప్రేమ, పెళ్లి మరియు దగ్గరి బంధువులను కూడా దూరం చేసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు.కాగా తాజాగా ఓ యువతి డబ్బు కోసం నిత్య పెళ్లి కూతురుగా మారి ప్రభుత్వ ఉద్యోగులను ట్రాప్ చేస్తూ అందినంత దోచుకుంటూ ఇటీవలే పోలీసులకు దొరికిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని విశాఖ పట్టణం పరిసర ప్రాంతంలో ఉన్న గాజువాక లో ‘రేణుక” అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.కాగా రేణుక గతంలో శ్రీనివాస్ అనే యువకుడిని ప్రేమించింది.
కానీ పలు కారణాల వల్ల శ్రీనివాస్ ని పెళ్లి చేసుకోలేక పోయింది.ఆ తర్వాత ఇదే ప్రాంతానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది.
కానీ పెళ్లయిన వారం రోజుల లోపు గర్భం దాల్చడంతో రేణుక భర్త రేణుకని వదిలేశాడు.దీంతో రేణుక తన ప్రియుడు శ్రీనివాస్ ని ఆశ్రయించి పెళ్లి చేసుకోవాలని కోరింది.
కానీ శ్రీనివాస్ మాత్రం రేణుక ని పెళ్లి చేసుకునేందుకు ససేమిరా అంగీకరించలేదు.దీంతో రేణుక అడ్డు తొలగించుకునేందుకు శ్రీనివాస్ పన్నాగం పన్నాడు.
ఈ క్రమంలో శ్రీనివాస్ దగ్గరి బంధువైన ఆర్మీ ఉద్యోగి ని రేణుకకు పరిచయం చేసి అతడిని పెళ్లి చేసుకోమని ప్రేరేపించాడు.దాంతో తన ప్రియుడు మాటలు నమ్మిన రేణుక ఆర్మీ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది.
అయితే కొంతకాలం పాటు వీరిద్దరూ అన్యోన్యంగా గడిపారు.
కానీ ఈ మధ్య కాలంలో రేణుక బుద్ధి గడ్డి తిన్నట్లుగా ప్రవర్తించింది.దీంతో బంగారంలాంటి కాపురాన్ని తన చేతులారా కూల్చుకుంది.అయితే ఇంతకీ ఏమైందంటే తన భర్త ఆర్మీలో ఉండటంతో ఆరు నెలలకు ఒకసారి ఇంటికి వచ్చి వెళుతూ వుండేవాడు.
దీంతో రేణుక డబ్బు కోసం మరో ప్రభుత్వ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది.అయితే తన రెండో భర్త ఇంటికి వచ్చినప్పుడు మాత్రం కొంతకాలం పాటు మేనేజ్ చేసేది.
చివరికి ఈ విషయం కాస్త తన రెండో భర్తకు తెలియడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.అంతేకాకుండా తన నుంచి దోచుకున్న డబ్బు, నగలు, బంగారాన్ని తిరిగి ఇప్పించాలని ఫిర్యాదు నమోదు చేశాడు.