శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి లోని..ఈ విషయాలు ప్రతి మహిళలోనూ ఉండాల్సిందే..!

సనాతన ధర్మంలో దేవుళ్లను మాత్రమే కాకుండా దేవతలను కూడా పూజించే ఆచారం ఉంది.

విష్ణు తన హృదయంలో భార్య లక్ష్మీదేవికి( Lakshmi devi ) భాగం ఇచ్చిన శివయ్య తన శరీరంలో పార్వతి( Parvati Devi )కి అర్ధభాగం ఇచ్చిన ప్రకృతిలో స్త్రీ, పురుషులు సమానమే అని తెలియజేయడానికి శక్తి స్వరూపునిగా జగన్మాతను చాలా రూపాలలో పూజిస్తూ ఉంటాము.

సమాజంలోని ప్రతి మహిళ తన జీవితంలో కుటుంబ సుఖసంతోషాలతో సాగిపోవాలంటే దుర్గాదేవి నుంచి కొన్ని విషయాలు కచ్చితంగా నేర్చుకోవాలని పండితులు చెబుతున్నారు.మరి ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ధ్యాన భంగిమలో నిమగ్నమైన విశ్వంలోని ప్రతి మూలలో జరిగే సంఘటనలను వీక్షించే పరమశివునితో పార్వతి తల్లికి ఉన్న సంబంధం మనకు సహనాన్ని నేర్పిస్తుంది.

మనం దానిని వేరే కోణం నుంచి చూస్తే శివపార్వతుల మధ్య ఉన్న సంబంధంలో సహనం, శాంతి పునాదిగా చేసుకుని అర్ధనారీశ్వరి తత్వాన్ని బోధిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.భార్యా భర్తల సంబంధం ఎలా ఉన్న అది ఎక్కువ కాలం కొనసాగాలంటే ఓపిక పట్టడం ఎంతో ముఖ్యం.ఒక మహిళా తన వ్యక్తిత్వంలో ఈ గుణాన్ని ఒక భాగంగా చేసుకుంటే కష్ట సమయం వచ్చినా ఆమె ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటుంది.

Advertisement

అలాగే ఇతరులను గౌరవించడం, ఆత్మగౌరవం దెబ్బతీసిన సమయంలో దేనికోసం రాజీపడకూడదు.ఇతరులకు మొదటి ప్రధాన్యత ఇవ్వాలనే ధోరణి మహిళల్లో సాధారణంగా ఉంటుంది.అయితే ఈ గుణం మహిళా జీవితంలోకి దుఃఖం ప్రవేశించేందుకు ద్వారంలా పని చేస్తుంది.

ఆత్మగౌరవంతో జీవించే వారిని ఇతరులు బలహీనంగా భావించి అన్ని విధాలుగా ఇబ్బందికి గురిచేస్తారు.

అయితే ఇష్టమైన వ్యక్తులను మాత్రమే కాకుండా జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్కరిని గౌరవించాలి.అయితే అది మీ గౌరవానికి భంగం కలిగేలా మాత్రం ఉండకూడదు.ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తే వారిని ఎదురుకోవడానికి సిద్ధంగా ఉండాలి.

దుర్గాదేవి( Durga Devi ) శక్తి రూపం మాత్రమే కాకుండా అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ దయ, ఆప్యాయతకు సంబంధించిన అనేక కథలు కూడా ఉన్నాయి.ఈ రెండు భావాలు మహిళలకు బలహీనతలు కాదు, బలాలు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
మీ వెన్నెముక బ‌లంగా ఉండాలా? అయితే ఈ జాగ్ర‌త్తలు తీసుకోవాల్సిందే!

మహిళలు అనుభవించే విధంగా పురుషులు ఈ రెండు భావోద్వేగాలను అనుభవించలేరు.అలాగే దుర్గాదేవి శత్రుసంహారం చేసే సమయంలో కూడా హృదయంలో అనురాగ భావన ఎప్పుడూ ఉంటుందని పండితులు చెబుతున్నారు.

Advertisement

అలాగే ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్న మహిళలు ప్రేమను హృదయం నుంచి వేరు చేయకూడదని చెబుతున్నారు.

తాజా వార్తలు