దేవుడా.. గుడికి ఏకంగా 3,700 కిలోల బరువున్న మహా గంట..!

సాధారణంగా ఎవరైనా భక్తులు వారికి తోచిన విధంగా ఆలయాలకు విరాళాలు అందిచేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

అయితే తాజాగా ఒక పురాతన ఆలయానికి భారీ బరువు గల గంటను సమర్పించారు ఒక భక్తుడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

మధ్య ప్రదేశ్ లోని ఒక పురాతన ఆలయానికి ఒక భక్తుడు భారీ గంటను సమర్పించాడు.మూడున్నర క్వింటాళ్ల బరువున్న ఆ గంటను ఊరేగింపుగా తీసుకోని వెళ్లి ఆలయానికి తరలించారు.

ఈ గంటను మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని మందసార్‌ జిల్లా లోని పశుపతినాథ్‌ ఆలయానికి  సమర్పించారు.ఇక భారీ ఊరేగింపులో భాగంగా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ప్రజల విరాళాల సేకరణతో ఈ మహా గంటలను పశుపతినాథ్‌ ఆలయానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా సమకూర్చారు.

God The Great Bell Weighing 3700 Kg For The Temple Alone, Ganta, Pasupathi Nath
Advertisement
God The Great Bell Weighing 3700 Kg For The Temple Alone, Ganta, Pasupathi Nath

ఇక ఈ పశుపతినాథ్ ఆలయంలో శివుడు అష్టముఖి లింగాకారంలో భక్తులకు దర్శనమిస్తాడు.వసంత పంచమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ భారీ గంటను స్వామి వారికీ అందించారు.ఈ మహా గంట బరువు ఏకంగా 3,700 కిలోల బరువు ఉండడంతో భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఈ గంటను శ్రీకృష్ణ కామ దేశ సంస్థ ఆధ్వర్యంలో తయారు చేయించి అష్టముఖి లింగాకారంలో ఉన్న  శివునికి సమర్పించారు.అంతేకాకుండా ఈ మహా గంటలు రామేశ్వరం నుంచి ఊరేగింపుగా మధ్యప్రదేశ్ లోని పశుపతినాథ్ ఆలయం వరకు తీసుకొని వచ్చారు.

ఈ మహా గంటను సంవత్సరం పాటు దేశవ్యాప్తంగా ఊరేగించి పశుపతినాథ్ ఆలయానికి తీసుకొని వచ్చారు.ఈ గంటను తయారు చేయడానికి ఏకంగా నాలుగు సంవత్సరాలు పట్టినట్లు భక్తులు పేర్కొంటున్నారు.

స్టామినా పెంచే ఆహారాల గురించి తెలుసుకుందాం
Advertisement

తాజా వార్తలు