మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా క్రిటిక్స్ నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.ఈ సినిమా షేర్ కలెక్షన్లు మరింత పెరిగితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ సినిమాకు మొదట అనుకున్న టైటిల్ సర్వాంతర్యామి.అయితే థమన్ ఈ సినిమాకు గాడ్ ఫాదర్ టైటిల్ ను సూచించారు.
వాస్తవానికి బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మూవీకి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను పరిశీలించడం జరిగింది.ఒక దశలో ఈ సినిమాకు ఈ టైటిల్ ఫైనల్ అయిందని కూడా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే అఖండ అనే టైటిల్ చివరకు ఫిక్స్ అయింది.సెప్టెంబర్ నెల 24వ తేదీ వరకు ఈ సినిమా షూటింగ్ జరిగిందని సమాచారం.
అక్టోబర్ 1వ తేదీకి ఈ సినిమా రీరికార్డింగ్ ను థమన్ పూర్తి చేశారని తెలుస్తోంది.
గాడ్ ఫాదర్ కలెక్షన్ల గురించి జరుగుతున్న ప్రచారం గురించి నిర్మాతలు స్పందిస్తూ ఈ సినిమాకు వచ్చిన రెవిన్యూ విషయంలో మేము సంతోషంగానే ఉన్నామని తెలిపారు.
హిందీ, ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వచ్చాయని నిర్మాతలు చెబుతున్నారు.థమన్ ఈ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ నేను పార్టీ పర్సన్ కాదని చెప్పుకొచ్చారు.

గాడ్ ఫాదర్ కొత్త తరహా సినిమా అని థమన్ కామెంట్లు చేశారు.ఈ సినిమా సక్సెస్ చాలా స్పెషల్ అని ఆయన కామెంట్లు చేశారు.సినిమాలో అన్ని సీన్లలో చిరంజీవి లేకపోయినా చిరంజీవి పోషించిన బ్రహ్మ పాత్రకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ బాగుంటుందని అనిపించిందని థమన్ చెప్పుకొచ్చారు.థమన్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
గాడ్ ఫాదర్ టైటిల్ కు సంబంధించి కొన్ని వివాదాలు తలెత్తాయని కానీ సమస్యలను పరిష్కరించుకున్నామని ఆయన తెలిపారు.