మనుషులకు మాత్రమే కాదు జంతువులకు కూడా ప్రేమ అవసరం.లేకపోతే అవి కూడా మానసికంగా కృంగిపోతాయి.
సాధారణంగా కుక్కలు, పిల్లుల వంటి జంతువులకు మనుషులు ప్రేమను పంచుతారు.కానీ మేకలు, గొర్రెల వంటి వాటిని ఆహారం కోసం చంపడమే తప్ప వాటిని ప్రేమగా చూసుకోరు.
కానీ ఒక వ్యక్తి మాత్రం మేక పిల్లలకు తన ప్రేమను పంచుతూ జంతు ప్రేమికులను ఆశ్చర్యపరుస్తున్నాడు.ఈ మేక పిల్లలు అతడి ప్రేమ కోసం పరితపిస్తున్నాయి.
క్యూలో నిలబడి మరీ తమను ఎత్తుకొని ముద్దాడమని అడుగుతున్నాయి.ఈ హార్ట్ టచింగ్ మూమెంట్స్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.

@Yoda4ever ట్విట్టర్( Twitter ) పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు 34 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ వీడియో చూసి చాలామంది ఎమోషనల్ అవుతున్నారు.స్వచ్ఛమైన లవ్ అందిస్తున్నాడని ఈ వ్యక్తిని చాలామంది పోగొడుతున్నారు.ఈ దృశ్యాన్ని చూసేందుకు చాలా బ్యూటిఫుల్ గా ఉందని స్వీట్ మూమెంట్ అని మరికొందరు కామెంట్లు పెట్టారు.

ఇక మాటలు రావనే కానీ మేకలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి.బతికినంతకాలం వీలైనంత ప్రేమను వాటికి పంచి పెట్టాలి.ఈ ప్రపంచంలో ఏ జీవికి హాని కలిగించే రైట్ ఎవరికీ లేదు.అయినా మనుషులు స్వార్థంతో చంపేస్తున్నారు.హింసిస్తున్నారు.ప్రపంచంలోనే అన్ని జీవుల పట్ల దయతో కరణతో మనుషులు ప్రవర్తించాలని యానిమల్ లవర్స్ కోరుకుంటున్నారు.
కానీ మనుషుల్లో మానవత్వం రోజురోజుకూ తగ్గిపోతుంది.మూగజీవాలు చూపిస్తున్న కరుణను కూడా కొందరు మనుషులు చూపించడం లేదు.
ఇలాంటి వారికి కఠిన శిక్షలు విధించడంలో ప్రభుత్వాలు కూడా ఫెయిలవుతున్నాయి.







