మనుషులకేనా...మాకూ బుర్ర ఉందంటున్న మేక...!

యాదాద్రి భువనగిరి జిల్లా: కూటి కోసం కోటి విద్యలు అనగా వినే ఉంటాం.

ఆ నానుడి మనుషుల జీవన విధానంలో కనిపించే రకరకాల పనులను ఉద్దేశించి అని అంటారు.

కానీ,ఆ సామెత మనుషులకే కాదు మాకు వర్తిస్తుందని చెప్పకనే చెబుతోంది ఓ మేక.మీకే కాదు మాకూ బుర్ర ఉందని తన ఆహారం కోసం ఎంత పని చేసిందో చూడండి.యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం ( Narayanapur )కేంద్రంలో ఒక మేక తన కడుపు నింపుకోవడం బయటికి వెళ్ళింది.

చౌరస్తాలోని రామాలయ ప్రాంగణంలో మొలిసిన చెట్టును చూసింది.ఎలాగైనా దానికి ఆహారంగా తీసుకోవాలని ప్రయత్నించింది, కానీ,ఆలయ ప్రహరీ గోడ అడ్డుగా ఉండడంతో నోటికి అందలేదు.ఆ గోడ పక్కన చెట్టు నీడ ఉందని ఓ వ్యక్తి తన బైక్ పార్క్ చేసి పోయాడు.

చెట్టు బండికి నీడనిచ్చి సహాయం చేస్తే,బండి మేకకు ఆహారం అందేందుకు సహాయం అన్నట్టుగా కనిపించింది అక్కడి దృశ్యం.మేక( Goat ) మెదడులో ఆలోచన గిర్రున తిరిగింది.

Advertisement

ఎంచక్కా బండి పైకెక్కి గోడ అవతల ఉన్న చెట్టుని ఆహారంగా అందుకుని హాయిగా తింటూ కనిపించింది.ఇదంతా గమనిస్తున్న స్థానికులు మేకకు కూడా బుర్ర,బుద్ధి భలే పని చేస్తున్నాయని ఆశ్చర్యానికి గురయ్యారు.

అన్నా చెల్లెల బందానికి ప్రతీక రాఖీ..ప్రముఖ ఎన్ఆర్ఐ రాధారపు సత్యం
Advertisement

Latest Video Uploads News