పవర్ స్టేషన్( Power Station ) అనగానే చాలా పెద్దగా ఉంటాయి.విశాల స్థలంలో పవర్ స్టేషన్ ను నిర్మిస్తారు.
అక్కడ చాలామంది సిబ్బంది వర్క్ చేస్తూ ఉంటారు.అయితే ఇప్పుడు అతి చిన్న పవర్ స్టేషన్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.
ఇవి ట్రాలీ సూట్ కేసు లాంటి పరిమాణంలో ఉంటాయి.ఈ పవర్ స్టేషన్‌ను ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు.
ఇంట్లో కరెంట్ పోయినప్పుడు కరెంట్ వాడుకోవడంతో పాటు బయటకు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు సూట్ కేసు లాంటి ఈ పవర్ స్టేషన్‌ను ఈజీగా తీసుకెళ్లొచ్చు.
అమెరికాకు చెందిన గోల్ జీరో ( Goal Zero ) అనే కంపెనీ పోర్టబుల్ పవర్ స్టేషన్‌ను తయారుచేసింది.సూట్ కేసు పరిమాణంలో ఉండే ఈ పవర్ స్టేషన్ ను ఇటీవల మార్కెట్ లోకి విడుదల చేసింది.యతి 6000 ఎక్స్( Yeti 6000x ) పేరుతో దీనిని లాంచ్ చేసింది.
ఈ పోర్టబుల్ పవర్ స్టేషన్‌కు మూడు విధాలుగా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.దీనికి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు.
దీని వల్ల బయటకు తీసుకెళ్లినప్పుడు సూర్యరశ్శి ద్వారా అది ఆటోమేటిక్ గా ఛార్జ్ అవుతుంది.అలాగే ఇంట్లోనే ప్లగ్ బోర్డు ద్వారా దీనిని ఛార్జ్ చేయవచ్చు.
ఒకవేళ కారులో ప్రయాణించే సమయంలో కారులోని అడాప్టర్ ద్వారా కూడా ఛార్జ్ చేయవచ్చు.
అంతేకాకుండా ఈ పోర్టబుల్ పవర్ స్టేషన్( Portable Power Station ) ఛార్జింగ్ పరిస్థితిని మనం మొబైల్ యాప్ లో ట్రాక్ చేసుకోవచ్చు.దీని కోసం యతి 2.0 అనే యాప్ ను ప్రవేశపెట్టారు.ఈ పోర్టబుల్ పవర్ స్టేషన్ ధర రూ.5999.95 డాలర్లుగా ఉంది.అంటే భారత కరెన్సీలో రూ.4.92 లక్షలు అన్నమాట.ఇది 2 వేల వాట్ల విద్యుత్ ను సరఫరా చేస్తుంది.దీని ద్వారా సరఫరా అయ్యే కరెంట్ వల్ల ఎలాంటి ఎలక్ట్రిక్ వస్తువులనైనా ఉపయోగించుకోవచ్చు.