ఛాన్స్ ఇచ్చిన పూరి గారే గుర్తుపట్టలేకపోయారు... హీరో కామెంట్స్ వైరల్!

సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వినూత్నమైన పాత్రలలో నటిస్తూ వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్న హీరో సత్యదేవ్ గురించి అందరికీ తెలిసిందే.ఈయన హీరోగా మాత్రమే కాకుండా కథ ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్రలలోనైనా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

 Given A Chance Puri Couldnt Even Remember Heros Comments Went Viral, Hero Saty-TeluguStop.com

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కీలకపాత్రలో నటించారు.అదేవిధంగా తమన్నాతో కలిసి నటించిన గుర్తుందా సీతాకాలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సత్యదేవ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశాడు.

తనకు ముందుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మి సినిమాలో నటించే అవకాశం వచ్చిందని తెలిపారు.చిన్నప్పటి నుంచి సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండడంతో చేస్తున్న ఉద్యోగం కూడా మానేసి సినిమాల కోసం తిరిగానని అయితే జ్యోతిలక్ష్మి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలియగానే ఆడిషన్స్ కి వెళ్ళానని తెలిపారు.

Telugu Chirenjeevi, Godfather, Satyadev, Jyothilaxi, Puri Jagannath-Movie

ఇక ఆడిషన్స్ కి పోతే ఆడిషన్స్ పూర్తి అయిన తర్వాత పూరి జగన్నాథ్ నన్ను సెలెక్ట్ చేశారు.అయితే ఈ సినిమాలో తప్పకుండా నాకు విలన్ పాత్ర లభిస్తుందని చెప్పి అప్పటికి నా శరీర బరువు 90 కేజీలు ఉండగా కష్టపడి 16 కిలోలు తగ్గాను.ఈ విధంగా 16 కిలోలు తగ్గి పూరీ దగ్గరికి వెళ్లడంతో ఆయన తనని గుర్తుపట్టలేకపోయారని చెప్పారు.ఇదేంటి పేషంట్ లా తయారయ్యావు అయినా నీకు విలన్ పాత్ర కాదు హీరో పాత్ర అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా తిరిగి మరోసారి బరువు పెరిగానని, ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

ఈ క్రమంలోనే సత్యదేవ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube