అది ఉత్తరప్రదేశ్లోని బుందేల్ ఖండ్ ప్రాంతం.ఓ ఫంక్షన్ హాల్ లో పెళ్ళి మొదలైంది.
బంధువులు, స్నేహితులతో సందడిసందడిగా ఉంది ఆ ప్రాంతం.పెళ్ళికూతురి పేరు మనకు ఎందుకు కాని పెళ్లి కొడుకు పేరు మాత్రం అశోక్ యాదవ్.
అంతా సాఫిగా సాగుతోంది అని అనకుంటే, పెళ్లి మధ్యలో సడెన్ గా ముగ్గరు అనుకోని అతిథులు వచ్చారు.అందులో ఒక అమ్మాయి కూడా ఉంది.
మన తెలుగు సినిమా అయితే ముందు “ఆపండి” అనే డైలాగ్ వినిపించేది.కాని అక్కడికి వచ్చిన అమ్మాయి డైలాగ్ లేకుండా యాక్షన్ చూపించింది.
గన్ తీసి పెళ్ళికొడుకు తలకి గురిపెట్టింది.తోడుగా తెచ్చుకున్న ఇద్దరు మగవారి సహాయంతో పెళ్ళి కొడుకుని బయటకి లాగి కిడ్నాప్ చేసి కారులో వేసుకోని తీసుకుపోయింది.
ఇదేదో సినిమా స్టోరీ అనుకుంటున్నారా? కాదండీ.రియల్ గా జరిగిన ఓ రియల్ ఇంసిడెంట్.
ఆ అమ్మాయి పెళ్ళి మధ్యలో వచ్చి, పెళ్ళి చెడగొట్టి అబ్బాయిని కిడ్నాప్ చేసింది కాబట్టి తనే విలన్ అనుకునేరు.అసలు విషయం ఏమిటో .ఆమె పెళ్ళి మధ్యలోంచి వరుడిని ఎందుకు కిడ్నాప్ చేసిందో చూడండి.
ఈ అశోక్ యాదవ్ మామూలోడు కాదులేండి.
ఓ పెద్ద ప్లేబాయ్.ఇప్పుడు కిడ్నాప్ చేసిన అమ్మాయి ఊరికే ఇదంతా చేయలేదు.
తనని ప్రేమించానని పెళ్ళి కూడా చేసుకున్నాడు.అదికూడా రహస్యంగా.
పెళ్ళి జరిగేదాకా కూడా ఎవరికి తెలియదట.ఇదొక్కటే కాదు, అంతకుముందు కూడా ఓ అమ్మాయిని పెళ్ళి చేసుకోని వదిలేసాడట.
ఇప్పుడు తల్లిదండ్రుల కట్నం ఒత్తిడి మీద మరో పెళ్ళికి సిద్ధపడ్డాడు.విషయం తెలుసుకున్న ప్రేయసి గన్ తీసుకోని మండపానికి చేరుకోని తనతోపాటే తీసుకెళ్ళిపోయింది.
పోలీసులు కేసు నమోదు నమోదుచేసుకోని గాలింపు మొదలుపెట్టారు.