సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది.ఏప్రిల్ 12న ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియో చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
దీనికి ఇప్పటికే లక్షకుపైగా వ్యూస్, వేలలో లైక్‌లు వచ్చాయి.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక గూడ్స్ రైలు ఫుల్ ఫాస్ట్ గా దూసుకెళ్లడం చూడొచ్చు.
అయితే రైలు వెళ్లిపోయిన తర్వాత ఒక షాకింగ్ దృశ్యం కనిపించింది.అదేంటంటే రైలు వెళ్లిన పట్టాల మధ్యలోనే ఒక యువతి పడుకొని ఉంది.
ఎర్రటి కుర్తా, ముఖం మీద కండువా ధరించిన యువతి రైలు వెళ్ళిన తర్వాత దర్జాగా లేసి ఫోన్ మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.వీడియో ప్రకారం రైలు వెళ్లిపోయిన వెంటనే, ఆ యువతి పట్టాలపై కూర్చుని తన ఫోన్‌తో కాల్ చేస్తుంది.
ఆ తర్వాత ఆమె మామూలుగా ఏమీ జరగనట్లుగా ట్రాక్‌లపై నుంచి లేచి ప్లాట్‌ఫామ్‌పైకి వస్తుంది.ఈ వీడియోని ఒక వ్యక్తి ఫ్లాట్ ఫామ్ పై నుంచి ఫోన్ లో రికార్డ్ చేశాడు.
ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.యమ స్పీడ్ తో పరిగెడుతున్న రైలు కింద పడుకోవటం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే.కానీ ఈమెకు చావంటే బహుశా సరదా అనుకుంటా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.







