విపరీతమైన జలుబు తో బాధపడుతున్న అమ్మాయి.. సీన్ కట్ చేస్తే

జలుబు అనేది ఒక అంటు వ్యాది.జలుబు ప్రాణాంతకం కాకపోయినా దీనివలన చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.

జలుబు చేసిన వారు మామూలుగా ఎదుర్కొనే ఇబ్బందులు చిరాకుగా అనిపించడం, అలసటగా ఉండటం, వర్క్ చేసే సమయంలో అయితే మరి ఇంత ఇబ్బంది కలుగుతుంది.ఇంకా జ్వరం, బాడీ పెయిన్స్ ఇలాంటి లక్షణాలు జలుబు లో సాధారణం అని మనందరికీ తెలిసిందే కానీ విచిత్రంగా జలుబు చేయడంతో తన గతాన్ని మర్చిపోయింది ఈ మహిళ.

అసలు ఇలా కూడా జరుగుతుందా అంటే జరిగింది అనే చెప్పాలి.లండన్ లోని ఒక కుటుంబంలో ఈ వింత సంఘటన జరిగింది.

క్లైర్ మఫెట్ అనే 43 ఏళ్ల మహిళ ఈ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంది.క్లైర్‌కు ఇద్దరు పిల్లలు, తన భర్త స్కాట్‌తో కలిసి సంతోషంగా జీవించేవారు అయితే 2021లో ఒక రోజు ఆమె కొడుకుకు బాగా జలుబు చేసింది జలుబు అంటువ్యాధి కావడంతో ఆ తరువాత రోజు నుంచి క్లైర్‌కు కూడా జలుబు బారిన పడింది.

Advertisement

ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని విధంగా జలుబు కారణంగా ఈ మహిళ కోమా లోకి వెళ్లి పోయింది.కంగారుపడి కుటుంబ సభ్యులు క్లైర్‌ను ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో జాయిన్ చేశారు.

దీంతో ఈ మహిళ మృత్యువు బారిన పడకుండా బయటకు వచ్చింది.కానీ ఏం లాభం తన గతాన్ని మర్చి పోయింది దాదాపు 20 ఏళ్ల గతాన్ని మర్చి పోయింది.

క్లైర్‌మఫెట్, తన భర్త స్కాట్‌తో కలిసి ఛానెల్ 4 టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.తనకు జరిగిన ఈ సంఘటన గురించి ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.తనకు ఇప్పటికీ చాలా విషయాలు గుర్తులేవని, గుర్తుకు రావడం లేదని తెలియజేశారు.

అసలు ఎందుకు ఈ మహిళ జలుబు కారణంగా తన గతాన్ని మర్చి పోయింది అంటే డాక్టర్లు చెబుతున్న సమాచారం ప్రకారం జలుబు వల్ల మెదడులో రక్తస్రావం జరిగి మెదడువాపు వ్యాది ఈమెలో ఏర్పడినట్లు వైద్యులు తెలియచేశారని క్లైర్‌మఫెట్ తెలిపారు.అయితే ఈ జలుబు కారణంగా సుమారు 16 రోజుల పాటు కోమాలోనే ఉన్నారట.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..
సినిమా వాళ్ళ దెబ్బకి విశ్వక్ సేన్ అడ్రస్ మార్చేశాడట !

ఈమె కోమా నుంచి బయటపడిన తరువాత తన జీవితానికి సంబంధించిన చాలా వరకు గతాన్ని మర్చి పోయింది అని తెలిపారు క్లైర్‌మఫెట్.

Advertisement
" autoplay>

తాజా వార్తలు