మీకు వినడానికే భయంగా ఉంటే, అక్కడ ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో ఇక ఆలోచించుకోండి.అనుకోకుండా పాము కంటపడితేనే మనం బెంబేలెత్తిపోతాము.
ముందూ వెనకా చూడకుండా పరుగెత్తుతాము.అలాంటిది ఓ నాగుపాము అమాంతం మనమీదకి ఎక్కేస్తే ఎలాగుంటుంది? ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి కదూ.కొందరికైతే పాము కాటేయకముందే గుండె ఆగినా ఆశ్చర్యపడక్కర్లేదు.తాజాగా అటువంటి దృశ్యం సోషల్ మీడియా( Social Media )లో దర్శనం ఇచ్చింది.
ఇంకేముంది నెటిజనాలకు కూడా గుండెల్లో గుబులు పుడుతోంది.
వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి గమనిస్తే, ఓ వ్యక్తి చల్లగా ఉంది కదా అని ఓ పార్క్‌లో చెట్టు కింద సేదతీరారు.కొద్ది క్షణాల్లోనే నిద్రలోకి జారాడు.ఇంతలో హఠాత్తుగా పెద్ద కోబ్రా పాము( Cobra ) అక్కడికి వచ్చి, మరి దానికి వెచ్చదనం కావాలని అనుకుందేమోగానీ అక్కడే నిద్రపోతున్న సదరు వ్యక్తి చొక్కాలోకి మెల్లగా దూరిపోయింది.
ఇంకేముంది దాని కదలికలకు మనోడు ఉలిక్కిపడి లేచాడు.దాంతో చొక్కా బటన్‌లో నుంచి తల బయటికి పెట్టి తొంగి చూసింది నాగు.దాంతో మనోడి భయంతో వణికిపోయాడు.అయితే ఇక్కడే మనోడు కాస్త తెలివి ఉపయోగించాడు.
ఊరికే కంగారు పడిపోకుండా చాలా నిశబ్దంగా వున్నాడు.ఇంతలో ఎదురుగా వున్నవారు అతని చొక్కా గుండీలు ఒక్కొక్కటి విప్పసాగారు.
దాంతో ఏమనుకుందో పాము గానీ, అది కూడా అతనికి ఎలాంటి హాని తలపెట్టకుండా చొక్కాలోనుంచి మెల్లగా బయటకి జారుకుంది.దాంతో మనోడు బతుకుజీవుడా అని మనసులో అనుకున్నాడు.మరి ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ఇందుకు సంబంధించిన వీడియో( Viral Video ) మాత్రం ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తూ హల్‌చల్ చేస్తున్నారు.
ఎక్కువగా అతగాడిని పొగిడేస్తున్నారు.ప్రమాదంలో కూడా చాలా తెలివిగా వ్యవహరించారు అంటూ మెచ్చుకుంటున్నారు.మరెందుకాలస్యం! మీరూ ఓ లుక్కేస్కోండి.మీకు తోచిన కామెంట్ చెయ్యండిక!
.